చిరంజీవి ‘నో ‘చెప్పిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ….ఆ సినిమా ఏమిటో తెలుసా?
చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణెదల శివ శంకర వరప్రసాద్ తెలుగు సినీ రంగంలో ఒక కథానాయకుడు. అంచె అంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటు తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళం,హిందీలో కూడా చిరంజీవి ప్రసిద్ధుడు. తనదైన మార్క్ నటనతో, వెరైటీ డైలాగ్ డెలివరీతో,అబ్బురపరిచే స్టెప్స్ తో ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు. తాను క్రియేట్ చేసుకున్న రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకున్న రికార్డ్ చిరంజీవికే దక్కుతుంది. కానీ ఎంత స్టార్ హీరో అయినా సరే తనదాకా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతూ ఉంటారు. అలాంటిదే మెగా స్టార్ విషయంలో కూడా జరిగింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో మనసంతా నువ్వే సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఆదిత్య కన్నడ ఆప్తమిత్ర సినిమాను చిరంజీవితో తీయాలని సంప్రదించగా అలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడరని చిరు సున్నితంగా తిరస్కరించారు.
దర్శకుడు వాసు రజనీకాంత్ తో చంద్రముఖి గా తీసి బ్లాక్ బస్టర్ హిట్ చేసాడు. ఈ సినిమాలో రజనీకాంత్ మానసిక వైద్యుడిగా నటించాడు. ఈ సినిమాలో జ్యోతిక,రజనీకాంత్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా నిర్మాతకు తెలుగు,తమిళం రెండు భాషల్లోనూ కాసుల వర్షాన్ని కురిపించింది.
