పవన్ కళ్యాణ్ తో జోడి కట్టిన ఈ హీరోయిన్ గుర్తు ఉందా ? ఆమె భర్త కూడా స్టార్ హీరో అని మీకు తెలుసా?
కొంత మంది హీరోయిన్స్ మొదటి సినిమాలో స్టార్ హీరోలతో నటించిన ఆ తర్వాత స్టార్ డమ్ ని సంపాదించటంలో విఫలం అవుతూ ఉంటారు. వారు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా సరే వారికీ ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అలాంటివారిలో ప్రీతి జింగ్యానీయ ఒకరు. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆమె నటించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో. ఆ సినిమా తమ్ముడు సినిమా. ముంబై కి చెందిన ఈ భామ మొదట రాజశ్రీ ప్రొడక్షన్ లో ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. ఆ ఆల్బమ్ హిట్ కావటంతో యాడ్స్ చేసే అవకాశం వచ్చింది. మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించిన ప్రీతి జింగనియా మొదటిసారిగా తమ్ముడు సినిమాతో సినీ పరిశ్రమకు వచ్చింది.
తమ్ముడు సినిమా హిట్ అయిన సరే ఆమెకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్,ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్స్ గా హిందీలో సూపర్ హిట్ కొట్టిన Mohabbatein సినిమా ద్వారా హిందీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం ప్రీతి జింగనియా పాత్రకు మంచి పేరు రావటంతో హిందీలో అవకాశాలు బాగానే వచ్చాయి.
ప్రీతి జింగ్యానీయ తెలుగు,హిందీ భాషల్లోనే కాకుండా కన్నడ,మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించింది. తమ్ముడు సినిమా తర్వాత నరసింహనాయుడు,అధిపతి,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఒక ఐటం సాంగ్ లో నటించింది.
ప్రీతి జింగ్యానీయ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా ఒక సినిమాను చేసింది. ఆ సినిమాలో హీరోగా నటించిన పర్విన్డ్ అబ్బాస్ ప్రేమలో పడి 2008 లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక పర్విన్డ్ అబ్బాస్ విషయానికి వస్తే బాలీవుడ్ లో హీరో. 1999 లో విడుదల అయినా DIllagi సినిమాతో పర్విన్డ్ అబ్బాస్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. పర్విన్డ్ అబ్బాస్ నటుడే కాకుండా డైరెక్టర్,టివి సీరియల్స్ లో కూడా నటించాడు. మొత్తానికి ఇద్దరు సినీ రంగంలో హీరో,హీరోయిన్స్ అయినప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న వీరిని అభినందించవలసిందే.