ప్రభాస్ తల్లి శివకుమారి ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలుసా?
చిన్న సినిమాల నుంచి విజయాలను అందుకుంటూ బాహుబలితో అగ్రశ్రేణి హీరోగా ఎదిగిన ప్రభాస్ యావత్ ప్రపంచంలోనే గుర్తింపు పొంది సూపర్ స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆ రోజుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలాడు. కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. వీళ్లది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అయినప్పటికీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కృష్ణం రాజు హీరోగా గోపికృష్ణ బ్యానర్ పై సూర్యనారాయణరాజు పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఇక కుటుంబలో సంతానం విషయానికి వస్తే, కృష్ణంరాజుకు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ అమ్మాయిలే. అందుకే ప్రభాస్ ని తన సినీ వారసునిగా తెరమీదికి తెచ్చారు.
ప్రభాస్ 1979 ఆగస్టు 13న సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు. ప్రభాస్ కి ప్రమోద్ అనే అన్న,ప్రగతి అనే అక్క ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ని హీరోగా పెట్టి ప్రభాస్ యువి క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ సినిమాలు తీస్తున్నాడు. నిజానికి ప్రభాస్ కి మొదటి నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదట.
మొహమాటం, సిగ్గు కూడా ఎక్కువేనట. అయితే తన వారసునిగా ప్రభాస్ ని తెరంగేట్రం చేయించడంలో కృష్ణంరాజు సఫలమయ్యాడు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు 2010ఫిబ్రవరి సడన్ గా మరణించడంతో తల్లి శివకుమారి షాక్ కి గురయ్యారు. తండ్రి లేకపోవడంతో డిప్రెషన్ కి గురయిన తల్లి కోసం ప్రభాస్ చాలారోజులు సినిమాలు మానేసి తల్లి దగ్గరే ఉన్నాడు. అయినా కోలుకోకపోవడంతో కొన్నాళ్ళు కృష్ణంరాజు ఇంట్లోనే ఉంచారు.
ఇప్పుడు ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ దగ్గరే తల్లి శివకుమారి ఉంటోంది. ఎందుకంటే దుబాయ్ షూటింగ్ కారణంగా ఒంటరిగా అమ్మను ఉంచలేక, అన్నయ్య దగ్గర ఉంచాడట. ప్రభాస్ అక్క కూడా తరచూ తల్లిని చూసి వెళ్తోంది. అంతేకాదు కృష్ణంరాజు కూడా తన తమ్ముని ఇంటిపక్కనే నివాసం ఏర్పాటుచేసుకుని, మొత్తం కుటుంబం ఒకేచోట కల్సి ఉండేలా చేయడంతో ప్రభాస్ , కృష్ణం రాజు కుటుంబాలు ప్రస్తుతం పక్కపక్కనే కల్సి వుంటున్నారు.