కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఎవరి కూతురో తెలుసా? కొన్ని నమ్మలేని నిజాలు
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు వారసులు అందరు దాదాపుగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బాలకృష్ణ,కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ ఇలా అందరూ సక్సెస్ అయ్యారు. బాలకృష్ణ,ఎన్టీఆర్ వరుస హిట్స్ తో తమ కెరీర్ ని మొదలు పెడితే, కళ్యాణ్ రామ్ ది మాత్రం డిఫెరెంట్ స్టోరీ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ అయినా ఎక్కువగా పరాజయాలు పలకరించాయి. దాంతో రెట్టింపు పట్టుదలతో సరికొత్త కథలను ఎంచుకొని సక్సెస్ బాట పట్టాడు. చాలా కస్టపడి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలివుడ్ లో కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. 3D టెక్నాలిజీతో సినిమా తీసి అందర్నీ ఆశ్చర్యపరచాడు.
ఇక కళ్యాణ్ రామ్ వ్యక్తిగత విషయానికి వస్తే అయన వివాహం స్వాతితో 2006 ఆగస్టు 10 న చాలా వైభవంగా జరిగింది. వీరి వివాహం పెద్దలు కుదిర్చినది. స్వాతి సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన స్వాతి ఒక డాక్టర్. కళ్యాణ్ రామ్ ఎటువంటి ఎఫైర్స్ లేవు.
కళ్యాణ్ రామ్ పెళ్ళిచూపుల్లో స్వాతిని చూసి ఈమె నా భార్య అని ఫిక్స్ అయ్యిపోయాడట. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడని కళ్యాణ్ రామ్ ని భార్య స్వాతి చాలానే మార్చింది. ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ చాలా సందర్భాలలో చెప్పాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
కళ్యాణ్ రామ్,స్వాతి శతమానంభవతి సినిమా చూస్తున్నప్పుడు స్వాతి ఎప్పుడు వైలెంట్ సినిమాలు చేసే బదులు శతమానంభవతి వంటి సినిమాలు చేయవచ్చు కదా అని క్లాస్ పీకిందట. అప్పటి నుండి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కళ్యాణ్ రామ్ కి భార్య అంటే అమితమైన ప్రేమ. స్వాతి పేరును చేతి మీద పచ్చబొట్టుగా వేయించు కున్నాడు. స్వాతి తండ్రికి పరిశ్రమలు ఉన్నాయి. కోటీశ్వరుల కుటుంబం నుండి వచ్చింది. స్వాతి తమ్ముడు హరి కూడా వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలకు మొదటి విమర్శకుడు హరి. బావ సినిమా చూసి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు హరి.
స్వాతి తల్లితండ్రుల కోరిక మేరకే MBBS చేసిందట. తాను కూడా అమ్మ నాన్నల మాట కాదనలేక US లో MS చేసానని, ఇద్దరం తల్లితండ్రుల కోసమే చదివామని చెప్పాడు. ప్రస్తుతం స్వాతి డాక్టర్ వృత్తికి దూరంగా ఉంది. భర్త,పిల్లలు బాగోగులు చూసుకుంటూ గ్రాఫిక్స్ సంస్థను రన్ చేస్తుంది.