సెప్టెంబర్ 2 వినాయక చవితి రోజు ఈ సమయంలో పూజ చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి
మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు,పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి,మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకూండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టిన రోజు అని కొందరు ఆలా కాదు గణాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు.
ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 2 న వచ్చింది. ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజే విగ్రహాలను తీసుకురావాలి. అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 31 ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.47, సాయంత్రం 4.00 నుంచి 6.00, తిరిగి రాత్రి 8.37 నుంచి 956. గంటల మధ్య శుభకాలం. ఈ సమయంలో ప్రతిమలను ఇంటికి తీసుకురావాలి.
సెప్టెంబరు 2 తెల్లవారుజామున 4.56 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై అదే రోజు రాత్రి 1.53 వరకు ఉంటుంది. కాబట్టి సెప్టెంబరు 2 సోమవారం ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని అంటున్నారు. అయితే వినాయకుడి జననం మధ్యాహ్నం సమయంలో జరిగిందని బలంగా నమ్ముతారు కాబట్టి ఉదయం 11.05 నుంచి 1.36 గంటల మధ్య పూజకు అనుకూలమై కాలమని పండితులు తెలియజేస్తున్నారు. ఉదయం 8.55 నుంచి రాత్రి 9.05 మధ్య చంద్రుని చూడరాదని అంటున్నారు.