Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ గింజలు 2 స్పూన్లు తింటే మీ బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేస్తుంది!

Peanuts Health benefits In Telugu : మతిమరుపు సమస్యతో బాధపడేవారికి పల్లీలు (వేరుశెనగలు) ఒక దివ్యౌషధం. వారంలో కేవలం రెండుసార్లు 2 స్పూన్ల పల్లీలు తినడం వల్ల మెదడు చురుగ్గా ఎలా మారుతుంది? జ్ఞాపకశక్తి పెరగడానికి ఇవి ఎలా సహాయపడతాయో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలలో వేరుశనగ ఒకటి. పేదవాని బాదంగా పిలిచే వేరుశనగలో దాదాపుగా బాదంలో ఉండే అన్నీ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే…
peanuts side effects
ఈ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వలన గుండెపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వేరుశెనగలో కరిగే ఫైబర్ మరియు ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.

వేరుశనగ తినటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలనే ప్రణాళిక ఉన్నవారు తింటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఎందుకంటే వేరుశనగలో చక్కెర మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం తక్కువగా ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. వేరుశనగల్లో ఉండే అమినో యాసిడ్స్ మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేసి మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయ పడుతుంది. దాంతో మతిమరుపు సమస్యలు ఉండవు.

వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వేరుశనగలో calcium, vitamin K సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు అవసరమైన బలాన్ని ఇచ్చి ఎముకలు గుల్లగా మారకుండా కాపాడతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారిలో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."