Healthhealth tips in telugu

మట్టి కప్పులో టీ తాగితే ఏమవుతుందో తెలిస్తే.. ఇక ఎప్పటికీ ప్లాస్టిక్, స్టీల్ కప్పులు వాడరు!

kulhad Tea Benefits In telugu : మట్టి కప్పు (Kulhad) లో టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. ప్లాస్టిక్, స్టీల్ కప్పులకు బదులుగా మట్టి కప్పు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలా తగ్గుతాయో ఈ ఆర్టికల్‌లో చదవండి.

ఈ మధ్య కాలంలో మట్టి కప్పులలో టీ తాగటం అలవాటు అయింది. మనలో చాలా మంది మట్టి కప్పులో టీ తాగటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మట్టి కప్పులో Tea తాగితే ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉదయం లేవగానే టీ తాగితే కానీ ఏ పని చేయాలని అనిపించదు.
Kulhad tea
అలా టీ అనేది మన జీవితాల్లో ఒక బాగం అయ్యిపోయింది. పూర్వం మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవటం, మట్టి కప్పులో టీ తాగటం వంటివి చేసేవారు. మరలా ఇప్పుడు మట్టి కప్పులలో టీ తాగటం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ కప్పులో టీ తాగటం వలన అందులోని రసాయనాలు వేడి టీలో కలిసిపోయి శరీరంలోకి చేరుతాయి.

శరీరంలోకి చేరిన రసాయనాల వల్ల జీర్ణవ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అదే మట్టి కప్పులో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎటువంటి హాని జరగదు. మట్టిలో కాల్షియం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మట్టి కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో కాల్షియం కూడా పెరుగుతుంది. అలాగే ఇది టీ యొక్క ఆమ్లతను తగ్గిస్తుంది.

టీ తాగిన తర్వాత గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మార్కెట్‌లో లభించే ప్లాస్టిక్ కప్పులు, గాజు కప్పులను చాలాసార్లు కడిగి వాడతారు. అలా వాడటం వలన వాటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. మట్టి కప్పును ఒక్కసారే వాడతారు. కాబట్టి ఎలాంటి చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించదు.

మట్టితో తయారు చేసిన కప్పులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. వాటిని ఉపయోగించి బయట పాడేసినప్పుడు మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. మట్టి కప్పులో టీ తాగటం వలన మన ఆరోగ్యానికి మంచిది. అలాగే పర్యావరణానికి కూడా మంచిది…కాబట్టి బయటకు వెళ్లినప్పుడు మట్టి కప్పులో టీ తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."