మహేష్ బాబు వదిన మృదుల గురించి ఎవరికీ తెలియని నిజాలు
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వంటి డేరింగ్ హీరో ఎవరు లేరని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎవరు వెళ్లని రూట్ లో వెళ్లాలన్నా,ప్రయోగాలు చేయాలన్న ఆయనకు ఆయనే సాటి. అయన కొడుకుగా మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నాడు. మహేష్ కంటే ముందు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. రమేష్ కూడా బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా రమేష్ నటించాడు. ఈ సినిమా 1974 లో వచ్చింది. ఆ తర్వాత 1987 లో సామ్రాట్ సినిమా ద్వారా రమేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పది సంవత్సరాల పాటు నటించిన రమేష్ ఎంకౌంటర్ సినిమాతో నటనకు స్వస్తి పలికాడు.
రమేష్ కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే మృదులతో పెళ్లి అయింది. సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన మృదుల తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తోలి రోజుల్లో అత్తమామలను బాగా చేసుకోవటమే కాకుండా మరిది మహేష్ బాబు,ఆడపడుచులు పద్మావతి,మంజుల,ప్రియదర్శిని పట్ల ఎంతో ప్రేమానురాగాలను చూపేది.
ఇక తన భర్త నటనకు స్వస్తి చెప్పి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకొనేటప్పుడు కూడా తన వంతు సహకారాన్ని అందించింది మృదుల. రమేష్ బాబు ప్రొడక్షన్ ప్రయివేట్ లిమిటెడ్, కృష్ణ ప్రొడక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలలో బోర్డు డైరెక్టర్స్ లలో ఒకరిగా సమర్ధవంతంగా వ్యవహరించింది మృదుల.
అర్జున్,అతిధి సినిమాలతో తన భర్త రమేష్ బాబు ఆర్ధికంగా దెబ్బతిన్న సమయంలో దూకుడు,ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించేలా ప్రోత్సహించి తిరిగి తమ సంస్థలను లాభాల బాటకు తీసుకురావటం మృదుల వ్యాపార దక్షతకు నిదర్శనం.
రమేష్ బాబు,మృదుల దంపతులకు భారతి,జయకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ మరొక వైపు తమ కంపెనీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికి కృష్ణ గారు మృదులను పెద్ద కూతురిగా భావిస్తారట. అమ్మ కూచి అయినా మహేష్ బాబును చిన్నప్పటి నుంచి సొంత కొడుకుగా చూసుకొనేదట. మహేష్ బాబు కూడా తమ కుటుంబ వ్యవహారాల్లో వదిన మాటకు తప్పనిసరిగా విలువ ఇస్తాడని ఘట్టమనేని కుటుంబ సన్నిహితులు చెప్పుతూ ఉంటారు.