స్నేహ చేసిన తప్పు ఇదే….భర్త గురించి తెలియని నమ్మలేని నిజాలు
హీరోయిన్ స్నేహ మద్రాస్ లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రాజారామ్ నాయుడు,తల్లి పద్మావతి. స్నేహ చిన్నతనం నుండి డాన్స్ నేర్చుకుంది. తరుణ్ హీరోగా ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రియమైన నీకు సినిమా సక్సెస్ కావటంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్. స్నేహ చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. రాధా గోపాలం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.
స్నేహ కొన్ని పరిధులకు లోబడి మాత్రమే నటించేది. సాంప్రదాయ బద్దంగా నటించటానికి ఎక్కువాగ్ ఇస్టపడేది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంది. సినిమాలలో మంచి అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే తమిళ హీరో ప్రసన్నను స్నేహ పెళ్లి చేసుకుంది. స్నేహ పెళ్లి చేసుకొనే సమయానికి ప్రసన్న చిన్న నటుడు. పెళ్లి చేసుకున్నాక స్నేహాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అలాగే ఆమె కూడా కుటుంబానికి అంకితం అయింది. స్నేహ,ప్రసన్న దంపతులకు విహన్ అనే కొడుకు పుట్టాడు. స్నేహ కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మరల స్నేహ ప్రెగ్నెంట్ కావటంతో మళ్ళీ సినిమాలకు దూరం కానున్నది. స్నేహ సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా మెరిసింది. కొన్ని రియాల్టీ షో లకు జడ్జిగా వ్యవహరించింది.

