Movies

చరణ్ రాజ్ యాక్టర్ అవ్వటానికి కారణం ఎవరో తెలుసా? నమ్మలేని నిజాలు

ఈటీవీ ఛానెల్లో ప్రతీ రోజు రాత్రి 9:30 నిమిషాలకు ఒక స్పెషల్ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుందన్న సంగతి అందరికి తెలిసిందే.అలా ప్రతీ సోమవారం రాత్రి ప్రముఖ సినీ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుందన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చెయ్యగా ఈసారి సీనియర్ నటుడు చరణ్ రాజ్ ముఖ్య అతిధిగా వచ్చారు.

“స్వయంకృషి”, “కొమరం పులి” లాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన అసలు పేరు బ్రహ్మానంద అని ఈ షో ద్వారా వెల్లడించారు.అయితే ఆయన స్వయంకృషి సినిమా చేసినపుడు చిరంజీవి గారు కానీ రాధికా గారు కానీ అందమైన దుర్మార్గుడు అనేవారని అన్నారు.అలాగే అసలు తాను నటుడిగా ఎలా మారాల్సి వచ్చిందో కూడా చెప్పారు.

తన చిన్నప్పుడు తాను యాక్టర్ అవుతానని చెప్పినపుడు “రేయ్ నీ మొహం చూస్కోరా ఎలా ఉందో?నువ్ ఫిలిం యాక్టర్ ఎలా అవుతావ్ అని తన ఫ్రెండ్స్ హేళన చేస్తే వారి దగ్గర ఛాలెంజ్ చేసి తాను నటుడిగా మారానని అలా ఛాలెంజ్ చేసి వచ్చేసాక ఒక ఏడెనిమిది ఏళ్లలో నటుడిగా స్థిరపడ్డానని చెప్పారు.మరి బ్రహ్మానంద ఇంకా ఇలాంటి ఎన్ని విశేషాలను పంచుకున్నారో తెలియాలంటే వచ్చే అక్టోబర్ 21 సోమవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కాబోయే ఆలీతో సరదాగా ప్రోగ్రాంను చూడాల్సిందే.