పవన్ తల్లి మెప్పు పొందిన ఏకైక సీరియల్ నటుడు!…ఎవరో తెలుసా?
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సీరియల్ నటుడు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అయ్యే “కార్తీకదీపం” నటుడు నిరుపమ్ ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తావనను తీసుకొచ్చారు.గత ఆదివారం జరిగిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో భాగంగా అవార్డు అందుకున్న ఆ సీరియల్ హీరో నిరుపమ్ మాట్లాడుతూ ఈ సీరియల్ చూసి ఒక పాతిక మామిడి పళ్ళు బుట్ట తన ఇంటికి ఎవరో ఇద్దరు మనుషులు తీసుకువచ్చారని అయితే ఎక్కడ నుంచి వచ్చాయా అని ఆరా తియ్యగా అవి పవన్ కళ్యాణ్ గారి తోట నుంచి వచ్చాయని తెలిసిందని అన్నారు.
వాటిని అక్కడ నుంచి పవన్ మాతృమూర్తి అయిన అంజనా దేవి గారు పంపారని తెలిపారు.ఆమె తనతో మాట్లాడినప్పుడు సినిమా మేము టిక్కెట్టు కొనుకొని ఆ కష్టాన్ని ఎంజాయ్ చేస్తామని కానీ మీరు మాత్రం ప్రతీ రోజు కస్టపడి సీరియల్ ద్వారా ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అందుకే మీరు పడే కష్టానికి ఏదైనా ఇవ్వాలనిపించింది అందుకే ఇలా పంపాను అని తెలిపారు అన్నారు.ఈ సంఘటన మాత్రం తన జీవితంలో మర్చిపోలేనని నిరుపమ్ తెలిపారు.మొత్తానికి పవన్ తల్లి నుంచి మెప్పు పొందిన ఏకైక నటునిగా నిరుపమ్ నిలిచారని చెప్పాలి.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది