చరణ్ ఇబ్బంది పెట్టిన దర్శకులు ఎంత మంది ఉన్నారో తెలుసా?
కొన్ని కాంబినేషన్స్ మాటల వరకే పరిమితం అవుతుంటాయి. ఎవో కారణాల వల్ల ఆ కాబినేషన్స్ సెట్స్ కు వెళ్లకపోవడం అప్పుడప్పుడు జరగడం సహజం. హీరోల డేట్లు సర్దుబాటు కాకపోవడం..అనూహ్యంగా కొత్త దర్శకుడు ముందురావడం వంటి కారణాల వల్లే ముందు మాట..వెనుక మాట ముందు జరుగుతుంటుంది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వల్ల ఇబ్బంది పడ్డ దర్శకులెవరంటే? ముగ్గురు దర్శకుల పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. రామ్ చరణ్ ధృవ సినిమా చేస్తోన్న సమయంలో యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ చరణ్ కు ఓ స్టోరీ చెప్పి ఓకే చేయించాడు. ధృవ రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్స్ కు వెళ్తుందని..దీన్ని గీతా ఆర్స్ట్ నిర్మిస్తుందని వినిపించింది.
కానీ అనూహ్యంగా మధ్యలో సుకుమార్ రంగస్థలం కథతో దూరడంతో? చరణ్ గాంధీని పక్కనబెట్టేసాడు. రంగస్థలం తర్వాత అయినా డేట్లు ఇస్తాడనుకున్నాడు . కానీ అప్పుడు బోయపాటి అడ్డు తగిలాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఆర్ ఆర్ ఆర్ ను ప్రకటించడంతో గాంధీ పేరంతా మర్చిపోయారంతా. దీంతో సినిమా కూడా అటకెక్కినట్లేనని తేలిపోయింది. అలాగే `జిల్` దర్శకుడు రాధాకృష్ణ కూడా ఓ యాక్షన్ స్టోరీ వినిపించడం…చరణ్ ఒకే చెప్పడం జరిగింది. ఆ దర్శకుడి పరిస్థితి దాదాపు గాంధీలాగే అయింది.
అయితే చరణ్ ని నమ్ముకోకుండా అప్పటికే ప్రభాస్ వద్ద కర్చీప్ వేయం..తొందర పెట్టడంతో మరో కథతో `జాన్` ని సెట్స్ కు తీసుకెళ్లాడు. చరణ్ వల్ల రాధాకృష్ణ కి కొంత సమయం వృద్ధా అయింది. మరోస్టార్ డైరెక్టర్ కొరాటాల శివతో చరణ్ ఠెంకాయ కొట్ట మరీ సినిమా ఆపేసాడు. కొరటాలతో క్రియేటివ్ డిఫరెన్స్ తలెత్తడంతో సినిమా రద్దు చేసారు. ఫలితంగా కొరటాల అవమాన పడాల్సివచ్చింది. చివరికి మెగాస్టార్ తో ప్రాజెక్ట్ సెట్ చేసి ఆ భారాన్ని చరణ్ కొంత వరకూ దించగలిగాడనుకోండి. అదీ మ్యాటర్.