Movies

అలనాటి నటుడు,ఫైట్ మాస్టర్ కొడుకు కూడా నటుడే అతడెవరో తెలుసా

సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. అయితే టాలెంట్ ఉంటేనే నిలదొక్కుకుంటారు. ఒకప్పుడు స్టెంట్ మాస్టర్ రాఘవులు అంటే అందరికీ తెల్సిన వ్యక్తి. ఇండియన్ సినిమా పుట్టాక తెలుగు చిత్రాలు కూడా కోల్ కత్తా, ముంబయిలలో షూటింగ్ జరిగేవి. ఆ తరువాత మద్రాస్ కేంద్రంగా దక్షిణాది బాషల చిత్రాల షూటింగ్స్ జరగడంతో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన రాజు మద్రాసు వెళ్లడంతో అప్పట్లో ఎన్టీఆర్ ,అక్కినేని,కృష్ణ,శోభన్ బాబు, తదితరులకు రాఘవులు స్టెంట్ మాస్టర్ గా ఉండేవారు. ఆయన కొడుకుగా రాజు ఎంట్రీ ఇచ్చి చిరంజీవి తదితరులకు ఫైట్స్ కంపోజ్ చేసేవారు.

చిరంజీవి ఫైట్స్ కి ప్రత్యేక ఇమేజ్ వచ్చిందంటే అందుకు రాజు మాస్టర్ కంపోజ్ చేసిన పోరాటాలే కారణం. దెబ్బలు తగలకుండా యాక్షన్ తో ఎలా మెప్పించవచ్చో అనే కొత్త వరవడి కి చిరంజీవిలో ఆయన అంకురార్పణ చేసారు. 1981లో కిరాయి రౌడీలు సినిమాతో ఫైట్ మాస్టార్ గా ఎంట్రీ ఇచ్చాడు. రాజుకి భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ,కృష్ణం రాజు,చిరంజీవి,బిగ్ బి అమితాబ్ వరకూ అందరికీ ఫైట్స్ కంపోజ్ చేసిన ఘనత రాజుదే.ఫైటర్ గా చిన్న చిన్న పాత్రలు,గెస్ట్ రోల్స్ కూడా వేసిన రాజు డబ్బారేకుల సుబ్బారావు, రాక్షసుడు,జ్వాలా వంటి మూవీస్ లో నటుడిగా దర్శనమిచ్చాడు.

1300చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసాడు. నర్సింగ్ యాదవ్ ని నటుడిగా విలన్ గా పరిచయం చేసాడు. రిస్కీ షాట్స్ కి ముంబయి ఫైట్ మాస్టర్స్ ని పిలిచేవాడు. దీనివలన విమర్శలు,ప్రశంసలు కూడా పొందాడు. ఇక వయస్సు మీద పడడంతో కొడుకు శివ చరణ్ హీరోగా నర్సింగ్ యాదవ్ తో కల్సి హైదరాబాద్ అనే మూవీని నటుడు సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప డైరెక్షన్ లో తీసాడు. ఇది డిజాస్టర్ అవ్వడంతో చివరి రోజుల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. గుండెపోటుతో సొంత ఊరిలో మరణించాడు.