Movies

మూడు భాషల్లో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ ఇప్పుడు నాజూకుగా ఉన్నా,ఒకప్పుడు ఆమె రూపం చూస్తే షాకయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కన్నడంలో యు టర్న్,తెలుగులో జెర్సీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె కోలీవుడ్ లో విక్రమ వీర మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కె 13,అలాగే అజిత్ సరసన నటించింది. హీరో విశాల్ సరసన నటించడానికి రెడీ అవుతోంది. అయితే ఒకప్పడు బొద్దుగా ఉండే తానూ అందం కోసం ఎంతగా శ్రమించానో వివరించింది.

అక్టోబర్ 2014విహార యాత్రకు విదేశాలకు వెళ్ళినపుడు శ్రద్ధా తీసుకున్న ఫోటో చూస్తే ఆమె ఎంత బొద్దుగా ఉందొ తెలుస్తుంది.’బట్టలకు,విహార యాత్రలకు ఆలోచించకుండా ఖర్చు చేసే దాన్ని,ఏది పడితే అది తినేదాన్ని. నెలకోసారి మాత్రమే వ్యాయామం చేసేదాన్ని. అందం విషయంలో ఎవరికన్నా తక్కువ దాన్ని కాదు. ఇక బద్ధకంగా ఉండేదాన్ని. చిన్నవయసులో ఇంత బరువు ఉండకూడదని భావించి అపార్ట్ మెంట్ లో ఉండే జిమ్ కి వెళ్లడం మొదలుపెట్టా’అని శ్రద్ధా వివరించింది.

జిమ్ కి వెళ్ళాక మొదట్లో 5నిముషాలు,తర్వాత 10నిముషాలు అలా కొన్నాళ్ళకు కంటిన్యూ గా 40నిముషాలు వ్యాయామం చేయడం మొదలు పెట్టానని శ్రద్ధా చెప్పింది. మొత్తానికి ఐదేళ్లు శ్రమించి 18కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. ఈలోగా ఆరోగ్యం దెబ్బతినడంతో వ్యాయామానికి,ఆహార నియమానికి మధ్య సమతుల్యం దెబ్బతిందని చెప్పింది. సామాజిక మాధ్యమాల కోసం కాకుండా ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు వ్యాయామం చేస్తూ ,అందంగా ఆరోగ్యంగా జీవించాలని చెబుతోంది ఈ భామ.