“సరిలేరు నీకెవ్వరు”టీజర్ పై సరికొత్త వివాదం.!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరూ”. భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం తాలూకా టీజర్ నిన్ననే విడుదల అయ్యి యూట్యూబ్ లో పంబ రేపుతోంది.అయితే ఓ పెద్ద హీరో టీజర్ మరియు ట్రైలర్ లు వస్తున్నాయి అంటే ఆటోమాటిక్ గా రికార్డుల గోల మొదలవ్వడం సహజం.
అయితే అంతకు మునుపు ఉన్న రికార్డులను అన్నిటిని తుడిచి పెట్టెయ్యాలని అభిమానులు గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు.ఇప్పుడు అదే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అభిమానుల్లో చిచ్చు పెడుతుంది.అసలు ఇప్పుడు వస్తున్న వ్యూస్ కానీ లైక్స్ కానీ అన్ని ఫేక్ అని ఇతర హీరోల అభిమానులు వాదిస్తున్నారు.అలాగే పలువురు సినీ విశ్లేషకులు కూడా ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ వ్యూస్ అని కూడా అంటున్నారు.అయితే ఇప్పటి వరకు వచ్చిన వ్యూస్ కు సంబంధించి మాత్రం ఓ తప్పు అడ్డంగా దొరికేసింది.
మొదటి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుసుకొని కేవలం ఇంత సమయంలో ఓ పోస్టర్ డిజైన్ చెయ్యడానికే 5 నిముషాలు పడుతుందని కానీ మిలియన్ వ్యూస్ ఇన్ని నిమిషాల్లో వచ్చాయని పోస్టర్ ఇంత తక్కువ సమయంలో ఎలా డిజైన్ చేసి రిలీజ్ చేస్తారని కాబట్టి ఈ చిత్రం టీజర్ విషయంలో అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
