Movies

బిత్తిరి సత్తితో మళ్ళీ కలుస్తున్న సావిత్రి.. రీ ఎంట్రీ షురూ..!

V6 ఛానెల్‌లో వచ్చే తీన్మార్ వార్తలు అంటే తెలియని వారుండరు. అక్కా తమ్ముడి క్యారెక్టర్స్‌తో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి, సావిత్రి అలియాస్ శివజ్యోతి కలిసి చదివే తీన్మార్ వార్తలు ప్రేక్షకులను ఎంతగా ఆకుట్టుకున్నాయో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే సావిత్రికి బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు అవకాశం రావడంతో గత మూడు నెలలుగా మా టీవీ స్క్రీన్‌పై కనిపించింది. అయితే సావిత్రి అటు బిగ్‌బాస్‌కు వెళ్ళిన కొద్ది రోజులకే బిత్తిరి సత్తి V6 ఛానెల్‌ను వదిలి భయటకు వచ్చేశారు.

అయితే V6ను వదిలేసిన బిత్తిరి సత్తి వెంటనే టీవీ9 ఛానెల్‌లో చేరి ఇస్మార్ట్ న్యూస్ అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి న్యూస్ అందిస్తున్నా అందులో ఏదో కొరత మాత్రం కనిపించేది. అయితే ఇటీవలే బిగ్‌బాస్ ముగియడంతో శివజ్యోతి కూడా టీవీ9 ఛానెల్‌లో చేరిపోయింది. బిత్తిరి సత్తి-సావిత్రి కాంబినేషన్ మళ్ళీ ప్రారంభం కానుంది. వీరిద్దరు కలిసి తీన్మార్ వార్తల మాదిరిగానే ఇస్మార్ట్ న్యూస్ చదవబోతున్నారు. ఇంకేముంది వీరిద్దరు కలిస్తే ప్రేక్షకులకు మళ్ళీ ఫుల్ ఫన్ గ్యారంటీ అనే చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను కూడా టీవీ9 కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది.