టాలీవుడ్ కింగ్ ఎవరు?

గతంలో ఎన్టీఆర్ ,అక్కినేని మధ్య నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ ఉండేదని,ఇద్దరూ పోటా పోటీగా నిల్చేవారని అంటారు. ఇక మెగాస్టార్ శకం వచ్చాక చిరంజీవి నెంబర్ వన్ అయ్యాడు. మరి ఇప్పుడు ఎవరు నెంబర్ వన్ అంటే యంగ్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్,మహేష్ బాబు,ప్రభాస్, రామ్ చరణ్ లలో ఎవరనేది సినీ వర్గం, ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో ఎవరికీ వారే హిట్స్ అందుకుంటున్నాడు.

వీళ్లల్లో ముందు వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉందని టాక్ వినిపిస్తోంది. టెంపర్ ,జనతా గారేజ్,నాన్నకు ప్రేమతో ,జై లవకుశ,అరవింద సమేత వీర రాఘవ మూవీస్ ఒకదానిని మించి మరొకటి ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆతర్వాత రేస్ లో మహేష్ బాబు ఉన్నారట. ఆతర్వాత అల్లు అర్జున్,రామ్ చరణ్,ప్రభాస్ లు ఉన్నారని,అయితే అందరిలో నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ అని తేలిందని సినీ వర్గాలు అంటున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే మిగతా హీరోల మూవీస్ లో కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వడం,మరికొన్ని ఆడకపోవడం జరుగుతోంది. వాళ్లకి లేని వరుస హిట్స్ జూనియర్ ఎన్టీఆర్ కే ఉందని,అందుకే నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తున్నాడని విశ్లేషిస్తున్నారు. సినీ వర్గాలే కాకుండా ఆడియన్స్ కూడా జూనియర్ కే మొగ్గు చూపుతున్నారని , ఈ ఏడాది జూనియర్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడని అంటున్నారు. ఎక్కువ హిట్స్ వచ్చిన హీరోగా ఈ రేంజ్ వస్తుందని అంటున్నారు.