Movies

రియాల్టీ షోలో నకిలీ ప్రేక్షకుల గురుంచి షాకింగ్ వాస్తవాలు

వావ్ అవును ఇప్పుడు అన్ని ఎంటర్ టైం మెంట్ చానల్స్ కి రియాల్టీ షోస్ తోనే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది. పైగా ఇప్పుడు వినోదం అంటే టివి అనేట్లుగా మారిపోయిన సంగతి తెల్సిందే. దీంతో వీటికి గిరాకీ ఎక్కువైంది. ఇక రియాల్టీ షోస్ లో పాల్గొనే ఆడియన్స్ తుళ్ళుతూ ,చప్పట్లు కొడుతూ,నవ్వుతూ ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే వాళ్లంతా నిజమైన ఆడియన్స్ కాదట. అవును ఇది నిజమని తెలిస్తే మనం షాకవుతాం.

సీరియల్స్ తర్వాత రియాల్టీ షోస్ కి ప్రాధాన్యం ఏర్పడడంతో జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. బూతులు మాట్లాడినా సరే,షో బ్రహ్మాండంగా క్లిక్ అయిపోతుంది. పైగా కాసుల వర్షం కూడా కురిపిస్తున్నాయి ఇలాంటి షోస్. ఇక షోస్ కి సెపరేట్ ఆడియన్స్ ని పిలిచి షో కి ఇంతచొప్పున డబ్బు ఇస్తారని,తెలియవచ్చింది. అవును చప్పట్లకు ఒక రేటు,నవ్వితే ఓ రేటు, ఇక విజిల్ వేస్తె మరో రేటు ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు ఉంటుందట.

సినిమాల్లో నటించడానికి జూనియర్ ఆరిస్టులకోసం కొన్ని ఏరియాలు ఎలా ఉన్నాయో,ఇప్పడు రియాల్టీ షోస్ కి వచ్చే ఆడియన్స్ కోసం కొని నెట్ వర్క్ లు స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల సమావేశాలు,సభలకు ఎలా డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తారో అలాగే రియాల్టీ షోస్ కోసం కూడా చైనాలో ఇలాంటి బాపతు జనాన్ని తీసుకొస్తారట. నకిలీ ప్రేక్షకుల పేరిట ప్రొఫెషనల్ ఆడియన్స్ ఇలా పుట్టుకొచ్చారు. ఇందుకోసం చైనాలో పెద్ద పరిశ్రమ నడుస్తోంది. మంచి ఆదరణ కూడా ప్రొఫెషనల్ ఆడియన్స్ కి ఉందట. ఒక్కో షోకి 4గంటల నుంచి 8గంటల వరకూ సమయం పడుతుంది. షో ని బట్టి 45డాలర్స్ నుంచి 120డాలర్స్ వరకూ ముట్టజెబుతారట. ఇలాంటి ఆడియన్స్ వైపు నాలుగు కెమెరాలు తిరుగుతూ ఉంటాయి. ఎవరినైనా ఈ ఉద్యోగంలో చేర్పిస్తే 30శాతం బోనస్ వస్తుందట. అంతేకాదు ఆడియన్స్ తమ నటనతో మెప్పిస్తే బిరుదులూ ఇస్తారట. అదండీ సంగతి.