“అల వైకుంఠపురములో” మరో స్టార్ హీరోయిన్..?
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ ఇద్దరో కాంబో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా ఇటీవలే సంక్రాంతి బరిలో ఈ చిత్రానికి లైన్ కూడా క్లియర్ అయ్యింది.అయితే ఇప్పుడు ఈ చిత్రంకు సంబంధించి మరో బజ్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు నివేత పేతురాజ్ లు కనిపించబోతున్న సంగతి కూడా అందరికి తెలిసిందే.కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.అయితే సినిమా కథనంలో భాగంగా కాకుండా ఓ ఐటెం సాంగ్ కోసం త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోయిన్ ను పెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.