Movies

కౌశిక్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా … భార్య ఏమి చేస్తుందో తెలుసా?

చాలా బాగుంది చిత్రం ద్వారా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ కౌశిక్ బాబు బాలనటుడిగానే కాక, పెద్దయ్యాక నటుడిగా కూడా రాణిస్తూ ,సినీ రంగంలో,డిజిటల్ రంగంలో కూడా తన ప్రతిభను చాటాడు. అంతేకాదు మనయజ్ఞం,కళంకిత వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్ మన రాష్ట్రంలోనే కాదు కేరళలో కూడా మంచి పేరుతెచ్చుకున్నాడు. అయ్యప్ప పాత్ర ద్వారా సీరియల్స్ లో నటించి అయ్యప్ప భక్తుల మన్నలను అందుకున్నాడు.

అయ్యప్ప స్వామిగా చాలామంది యితడు కనపడాగానే దణ్ణం పెట్టుకుంటారంటే ఇతను ఎంతగా ఆడియన్స్ పై ముద్రవేసాడో చెప్పక్కర్లేదు. రామునిగా,విష్ణుమూర్తిగా, శివుడిగా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు కన్నా ముందే మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వైట్ బాయ్స్ అనే మళయాళ మూవీకి మూడు స్టేట్ అవార్డ్స్ తెచ్చుకున్నాడు. రాఘవేంద్రరావు,చిరంజీవి,బాలయ్య,నాగార్జున వంటి అనుభవం గల వారితో కలిసి పనిచేసే ఛాన్స్ కూడా కౌశిక్ కి వచ్చింది.

ఇక ఫాజి చిత్రం ద్వారా కౌశిక్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి తన సత్తా చాటాడు. అయితే టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయిన ఇతడికి నవంబర్ 24న కౌశిక్ మేరేజ్ భవ్య అనే అమ్మాయితో వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 25న హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."