Movies

“సుడిగాలి సుధీర్” ఫస్ట్ లవ్ ఎప్పుడు మొదలు అయిందో తెలుసా?

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ షోలలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కూడా ఒకటి.అయితే గత వారం ముఖ్య అతిధిగా ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి వచ్చారు.అలాగే వచ్చేవారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ కు మాత్రం స్మాల్ స్క్రీన్ సంచలనం సుడిగాలి సుధీర్ వచ్చాడు.ఇప్పుడు ఆ ఎపిసోడ్ తాలుకా ప్రోమోను ఈటీవీ వారు విడుదల చేసారు.ఈ ప్రోమో ద్వారా సుధీర్ చాలా విషయాలే వెల్లడించాడు.మొదటగా ఆలీని చూసి సుధీర్ ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది.

ఆ తర్వాత సుధీర్ ది ఏదో వీడియో వేసెయ్యండి అన్నపుడు డైరెక్ట్ ఎల్ఈడి దగ్గరకు సుధీర్ వెళ్ళిపోయి వద్దు వద్దు అనడం మరింత నవ్వు తెప్పిస్తాయి.అలాగే సుధీర్ లవ్ స్టోరీ కోసం కూడా టాపిక్ వచ్చింది.అయితే సుధీర్ మామూలోడు కాదుగా తన ఐదో తరగతిలోనే ఓ అమ్మాయికి లైన్ వేసేవాడని చెప్పాడు.అలా స్కూల్ లో లీవ్ లెటర్స్ రాయడం నేర్పిస్తే తానేమో ఆ అమ్మాయి పేరు రాసేవాడిని అని అన్నాడు.అలా తాను ఫిఫ్త్ క్లాస్ ప్రపోజ్ చేస్తే ఆమె 9వ తరగతిలో ఓకే చేసిందని అసలు విషయం చెప్పాడు.ఇక అలాగే రష్మితో తనకున్న అనుబంధం కోసం కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగవలసిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."