Movies

నిర్మాతగా మారి చేతులు కాల్చుకొని నిండా మునిగిన హీరోలు

ఈ మధ్య సినిమాలను తమకు తామే కొందరు హీరోలు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. దీంతో సినిమా నష్టాల బాట పట్టి కోలుకోలేని దెబ్బ తింటున్నారు. నేచురల్ స్టార్ నాని ‘అ’అనే మూవీని అందించినా సక్సెస్ అందుకోలేక చతికిలబడ్డాడు. కొన్నిచోట్ల బాగున్నా,కొన్నిచోట్ల ఊహించిన నష్ఠాలను తెచ్చిపెట్టింది. హీరో రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150తీసి లాభాలను వెనకేసుకున్నాడు. అయితే 280కోట్ల భారీ బడ్జెట్ తో సైరా తీసి, దాదాపు 30శాతం మేరకు నష్టాలను మూటగట్టుకుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎందరో కొత్తవాళ్లకు ఛాన్స్ లు ఇచ్చి,లాభపడిన కింగ్ నాగార్జున ఇటీవల హలో, మన్మధుడు 2మూవీస్ తీసి నష్టాలను చవిచూశాడు. నందమూరి బాలయ్య భారీ బడ్జెట్ తో కొందరు నిర్మాతలను కలుపుకుని మరీ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ దారుణమైన నష్టాలను మిగిల్చింది. రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించిన కిక్ 2మూవీ సగానికి పైనే నష్టాన్ని మిగిల్చింది. చలో మూవీతో హిట్ అందుకున్న నాగసౌర్య సొంతంగానే మళ్ళీ తీసిన నర్తన శాల తో చేతులు కాల్చుకున్నాడు.

హీరో నితిన్ సొంతంగా బాధ్యత తీసుకుని అక్కినేని అఖిల్ హీరోగా తీసిన అఖిల్ మూవీ ఎలాంటి లాభాలను తేలేదు. ఇక సోదరుడు ఆర్యన్ రాజేష్ తో కల్సి అల్లరి నరేష్ ఈవీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన బందిపోటు మూవీ దారుణంగా డిజాస్టర్ అయింది. ఇప్పుడిప్పుడే బ్లాక్ బస్టర్స్ మూవీస్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో విజయ దేవరకొండ మీకు మాత్రమే చెబుతా పేరిట నిర్మాతగా మారి తీసిన మూవీ డిజాస్టర్ అయింది. కనీస పెట్టుబడి కూడా రాకపోవడంతో అతడి ప్రయోగం బెడిసికొట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."