Movies

దేశంలోనే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో ఎవరో తెలుసా?

దేశంలో వివిధ భాషల్లో చిత్ర రంగం రాణిస్తోంది. ఆయా భాషల్లో హీరోలు ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తూ తమ సత్తా చాటుతారు. అయితే మన దేశం మొత్తం మీద ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరొ ఎవరని అడిగితె కొంచెం నిశిత పరిశీలనలోకి వెళ్లాల్సిందే. అయితే ఫాన్స్ తమ హీరోకి ఎక్కువ అంటే,తమ హీరోకే ఎక్కువంటూ జబ్బలు చేరుస్తారు.

నిజానికి వివాదాలు లేకుండా ఎక్కువ హిట్స్ గల హీరో గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందని తెలుస్తోంది. హిందీ వరకూ వస్తే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఒకే ఒక్క ఇండస్ట్రీ హిట్ ఉంది. ఇది నిజంగా నమ్మలేని నిజమే. ఆ సినిమా ఏంటంటే షోలే అని చెప్పాలి. అయితే ఎక్కువ హిట్స్ అందుకున్న హీరోగా హిందీలో 6హిట్స్ తో అమీర్ ఖాన్ కి పేరుంది. మలయాళంలో మోహన్ లాల్ కి సోలో హీరోగా 9ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. మల్టీ స్టారర్ గా మరొకటి ఉంది. ముమ్ముట్టికి నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.

కన్నడంలో రాజ్ కుమార్ కి 11ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇక తెలుగులో వివాదం ఉన్న ఖైదీ మూవీని పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవికి 7ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అక్కినేనికి సోలో హీరోగా 6, మరో మూవీ మల్టీ స్టారర్ గా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ 7కాకుండా, మరోమూవీ ప్రేమనగర్ మూవీ ఉన్నా , దీనిపై వివాదం ఉన్నందున పరిగణనలోకి తీసుకోవడం లేదు. తమిళంలో రజనీకాంత్ కి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. కొన్నింటిపై గల వివాదాలను పక్కన పెడితే 11ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఎంజీఆర్ 5, శివాజీ గణేశన్ 3ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వీటన్నింటిని చూస్తే, ఇండియాలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో రాజ్ కుమార్ అని చెప్పాలి.