Movies

నాగ చైతన్య గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పిన వెంకటేష్!

ఇటీవల కాలంలో ఎక్కువగా యంగ్ హీరోలతో నటిస్తున్న ఏకైక నటుడు ఎవరంటే వెంకటేష్ అనే చెప్పాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఇపుడు వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య తో నటిస్తున్నాడు. అయితే వెంకీ మామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ఇప్పటివరకు చాలాసార్లు తెలిపారు వెంకటేష్. అయితే నాగ చైతన్య, రానా దగ్గుబాటి కూడా సినిమాల్లోకి వస్తారని ఊహించలేదని అన్నారు.

అయితే నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, చైతూ హీరో అవుతాడని అసలు ఊహించలేదని అన్నారు. చిన్నపుడు లావుగా ఉండి, ఎపుడూ చికెన్ తింటూ బుగ్గలతో ముద్దుగా ఉండేవాడని తెలిపారు. అయితే అలాంటి చైతూ ఇప్పుడు ఫిట్ గా, స్లిమ్ గా తయారయ్యాడని అన్నారు. అంతేకాకుండా చిన్నప్పటినుండి చూస్తూ ఉండటం వలన, రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళం కనుక అంత తేలికగా నటించలేకపోయాం అని తెలిపారు. అయితే ఈ చిత్రంలో షాకింగ్ ఎలిమెంట్ తో పాటుగా, ఎవరూ ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఉందని వెంకటేష్ అన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."