Movies

80లలో బాలయ్య ఎలా ఉండేవాడో తెలిస్తే షాక్ అవ్వలసిందే

ఈటీవీలో ప్రసారం అయ్యేటటువంటి ప్రోగ్రాంలలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” కూడా ఒకటి.అయితే ఈ సోమవారం ఎపిసోడ్ కు ముఖ్య అతిధిగా 90శాతం హిట్ రేటింగ్ ఉన్న దర్శకుడు కోదండరామి రెడ్డి వచ్చారు.అలా వచ్చిన ఆయన తన సినిమాల కోసం ఆలీతో ఎన్నో విషయాలను పంచుకున్నారు.అయితే అలా మాట్లాడుతూ నందమూరి నటసింహం బాల కృష్ణ కోసం ప్రస్తావన రాగా ఆయన కోసం కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అప్పట్లో అంటే బాలకృష్ణ కోసం ఇప్పుడున్న మిడిల్ ఏజ్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు.కానీ ఇప్పుడు బాలయ్య ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు,ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో అన్నది అందరికి తెలుసు.

కోపం ఎక్కువే అని తెలిసినా కొన్ని కొన్ని సందర్భాలలో బాలయ్య ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ మాములుగా ఉండదు.అలాంటి వీడియోలు ఈ మధ్యనే వచ్చి బాగా వైరల్ కూడా అయ్యాయి.అయితే ఇదేమి బాలకృష్ణ కొత్తగా అలవాటు చేసుకున్నది కాదని టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ కోదండరామి రెడ్డి తెలిపారు.అప్పుడు 1988 తన దర్శకత్వంలో “తిరగబడ్డ తెలుగు” బిడ్డలు అనే చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ సబ్జెక్టు ఆయనకు నచ్చకుండానే చేసారని,అలాగే షూటింగ్ సమయంలో మాత్రం యమ చలాకీగా ఉండేవారని ప్రతీ ఒక్కరితో ఆడుతూ పాడుతూ ఉండేవారని అయితే ఈ చిత్రం తనకి నచ్చకుండా చెయ్యడం వల్లనే ఏమో ఓ సీన్ రీటేక్ అనగానే అయినా ప్లాప్ అయ్యే సినిమాకు మళ్ళీ రీటేక్ ఎందుకు నేను చెయ్యను అని వెళ్లి పోయారని బాలయ్య కోసం కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.మొత్తానికి బాలయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నారని చెప్పాలి