మూడో తరం వారసుల సినిమాలు ఇవే….!!!

అన్ని రంగాల్లో వారసత్వం మాదిరిగా సినీ రంగంలో వారసత్వం జోరుగానే ఉంది. పెద్దయ్యాక హీరోల రావడమే కాదు చిన్నపుడు చైల్డ్ ఆరిస్టులుగా కూడా స్టార్ హీరోల పిల్లలు కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఫాన్స్ లో క్రేజ్ ఏర్పడుతోంది. వన్ నేనొక్కడినే మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇటీవల ఓ యాడ్ లో మహేష్ తో కల్సి,గౌతమ్ కృష్ణ నటించాడు. ఇందులోనే మహేష్ కూతురు సితార కూడా స్క్రీన్ మీదికి రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇటీవలే తన ఫ్రెండ్ అయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కల్సి సితార ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టింది.7ఏళ్ళ ప్రాయంలో తన ముద్దు ముద్దు మాటలతో ఆల్ రౌండర్ అయింది. పిల్లలకు ఆసక్తి కల్గించే పలు వీడియోలు రూపొందిస్తోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తి,డిస్ని మూవీలో ఎల్ సా అనే పాత్రకు గొంతు అరువు ఇచ్చింది. అలాగే భలే భలే మగాడివోయ్ మూవీలో చిన్నప్పటి నాని పాత్రలో సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు,సుధీర్ కొడుకు చరిత్ మానస్ నటించి మెప్పించాడు. ఆతర్వాత విన్నర్ మూవీలో చిన్ననాటి సాయి ధర్మ తేజ్ పాత్రను పోషించాడు. గుర్రాల ఛేజింగ్ సీన్ కి భయపడినప్పటికీ సీన్ ఆగిపోతుందని అలాగే పరుగెత్తాడట.

సుధీర్ రెండో కొడుకు దర్శన్ కూడా గత ఏడాది గూఢచారి సినిమాలో చిన్నప్పటి అడవి శేష్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. నటి మీనా కూతురు నయనిక పోలీసోడు సినిమాలో విజయ్ కూతురుగా వేసి మెప్పించింది. తల్లిలాగే ముద్దుగా ఉండే ఈ చిన్నారి తనపాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. స్టేజ్ ఏక్కితే స్పీచ్ కూడా దంచేస్తోంది. రేణు దేశాయ్ డైరెక్టర్ గా అవతారం ఎత్తి, తీసిన ఇష్క్ వాలా మూవీలో లిటిల్ పవర్ స్టార్ అకిరా నందన్ తెరమీద కనిపించాడు. హీరో రవితేజా తన కొడుకు మహాధన్ ని రాజా ది గ్రేట్ మూవీతో వెండితెరకు పరిచయం చేసాడు. కళ్యాణ్ రామ్ పిల్లలు కూడా సినిమాల్లో మెరిశారు. మహానటి లో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను సింగర్ స్మిత కూతురు సివిని ఆడిషన్స్ లేకుండానే ఎంపికచేశారట.