రజనీకాంత్ ఎప్పుడూ వెళ్లే బాబాజీ గుహ రహస్యాలు…ఎక్కడ ఉందో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. సాదాసీదాగా ఉండడం,మంచి వ్యక్తిత్వం ఆయనలోని ప్రత్యేకతలు. తన నటనతో అభిమానులను అలరించడంతో పాటు ప్రతియేటా హిమాలయాలకు వెళ్తాడు. మానసిక ప్రశాంతతకు,విశ్వమానవాళి శ్రేయస్సుకోసం రజనీ అక్కడి బాబాజీ గుహల్లో ప్రార్ధనలు చేస్తారట. ముఖ్యమైన సందర్భాల్లో బాబాజీ గుహలను సందర్శిస్తుంటారు.

తాజాగా దర్భార్ మూవీ షూటింగ్ పూర్తయ్యాక రజనీ అక్కడికి వెళ్లారు. అయితే ఈ గుహలను ఎవరైనా సందర్శించవచ్చా, అక్కడ ఎవరుంటారు వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. హిమాలయాల్లో కనిపించే మహాపురుషుని రూపమే మహావతార్ బాబాజీ. రజనీకాంత్ నటించిన బాబా సినిమాలో ఇది కనిపిస్తుంది. 1861 బ్రిటిషు వారి హయాంలో ధనపురి ఇంజనీరింగ్ విభాగంలో లాహిరి మహాశయా పనిచేసేవారు. అక్కడినుంచి ఉత్తరాఖండ్ లోని రాణిఖేత్ పట్టణానికి బదిలీ కావడంతో అక్కడున్న ద్రోణగిరి పర్వత అందాలకు ఆకర్షితులై అక్కడికి వెళ్లారు. అనుకోకుండా ఓ గుహ దగ్గరకు వెళ్లి అక్కడ మహావతార్ బాబాని దర్శించుకున్నారు.

క్రియా యోగ విద్యను అభ్యసించారు. అప్పటినుంచి ఈ గుహలు ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్నాయి. క్రియా యోగం,క్రియా కుండలిని గురించి మహావతార్ బాబాజీ ప్రపంచానికి పరిచయం చేసారు. కుమారస్వామి అనుగ్రహంతో ఆయన మృత్యువుని జయించినట్లు చెబుతారు. దాంతో ఎల్లప్పుడూ యువకునిలా ఉండేలా సిద్ధిపొందాడని అంటారు 8మంది సౌఖ్యంగా జ్ఞానాభ్యాసం చేసుకోవచ్చు. ఢిల్లీనుంచి సులభంగా ఈ గుహలకు చేరుకోవచ్చు. 400కిలోమీటర్లు కారులో వచ్చి అక్కడ నుంచి 35కిలోమీటర్లు రావాలి. అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే మహావతార్ బాబా గుహలు వస్తాయి. మరో మార్గం ద్వారా అయితే 250కిలోమీటర్లు ఢిల్లీ నుంచి ప్రయాణించి రుషికేశ్ చేరుకొని అక్కడ నుంచి మరో 200కిలోమీటర్లు ప్రయాణించి నంద్ ప్రయాగ్ చేరుకోవచ్చు . అక్కడ నుంచి 120కిలోమీటర్లు ప్రయాణించి కుకుచినా చేరుకొని,అక్కడనుంచి 2కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇలా రెండు మార్గాల ద్వారా వెళ్లి చూడవచ్చు.