Kitchen

New Year – ప్లమ్ కేక్

వివిధ రకాల పద్ధుతుల్లో కేకులను ఎన్నోవిధాలుగా తయారుచేసుకోవచ్చు. అందులో ఈ ప్లమ్ కేక్ ఒకటి. ఇది ఎంతో టేస్టీగా, తియ్యగా, రుచికరంగా వుంటుంది. దీనిని కేవలం బర్త్’డే సందర్భంగానే కాదు.. పండుగ సందర్భాల్లో కూడా ప్రత్యేకంగా తయారుచేసి అతిథులకు పంచిపెట్టవచ్చు.

ఈ రకమైన కేకులను బయటినుంచి ఆర్డర్ చేయించి తెప్పించుకోవడం కన్నా.. ఇంట్లోనే చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కావలసిన పదార్థాలను తగిన మోతుదాలో జోడించి తయారుచేసుకుంటే.. రుచితోబాటు ఆరోగ్యంగా మెలగొచ్చు. మరి ఈ కేక్’ని ఎలా చేస్తారో తెలుసుకుందాం…

కావాల్సిన పదార్ధాలు

1 – 2 కప్స్ మైదా
2 టీ స్పూన్స్ చెర్రీస్ (సగం గార్నిష్ కోసం)
2 టీ స్పూన్స్ వాల్నట్ (తరిగినవి)
3 టీ స్పూన్స్ ఎండుద్రాక్ష
1 టీ స్పూన్ లెమన్ జస్ట్
1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్
1 కప్ బ్రౌన్ పంచదార
3 – 4 చుక్కలు వెనిలా ఎసెన్స్
3 గుడ్లు
1/2 కప్ వెన్న (మెత్తగా)

తయారు చేయు విధానం
ముందుగా ఓవెన్’ను 160 డిగ్రీల ఉష్ణోగ్రతలో వుంచాలి. (ఓవెన్ తప్పనిసరి)ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి. అనంతరం అందులోనే వాల్ నట్స్, ఎండుద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.మరొక బౌల్ తీసుకుని అందులో బట్టర్, బ్రౌన్ షుగర్ వేసి… క్రీమ్’గా తయారయ్యేవరకూ బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే వెనీలా ఎస్సెన్స్, గుడ్డు, లెమన్ జస్ట్ వేసి కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న అనంతరం ఇందులో ఇదివరకే మిక్స్ చేసి పెట్టుకున్న మైదా, బేకింగ్ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా కలియబెట్టాలి.తర్వాత కేక్ టిన్’ను తీసుకుని దానికి బట్టర్ అప్లై చేయాలి. అనంతరం పైన తయారుచేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ టిన్’లో పోయాలి. మొత్తం మిశ్రమాన్ని 20 నిముషాలపాటు బేక్ చేసిన తర్వాత చల్లార్చాలి. అంతే! ప్లమ్ కేక్ రెడీ!