Movies

మూడు పాత్రలతో అలరించిన నటులు…ఎంతమంది సక్సెస్ అయ్యారో చూడండి

సినిమాల్లో ఒక పాత్ర చేసి మెప్పించడమే గగనం. ఇక రెండు పాత్రలంటే చాలా కష్టపడాలి .. మరి మూడు పాత్రలు పోషించాలంటే మామూలు విషయం కానే కాదు. ఒక్కో పాత్రకి ఒక్కొక్క మేనరిజం,బాడీ లాంగ్వేజ్ ఉండాలి. తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా ఆరుగురు మాత్రమే తెలుగు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసారు. అయితే ఎక్కువ సినిమాలు ప్లాప్ అయ్యాయి. తెలుగు సినీ చరిత్రలో మొదటి సారి మూడు పాత్రలు పోషించిన హీరో ఎన్టీఆర్. 1977లో వచ్చిన దాన వీర సూర కర్ణ మూవీలో కృష్ణడు,దుర్యోధనుడు,కర్ణుడు ఈ మూడు పాత్రలు చేసి ,మెప్పించడమే కాదు,దర్శకత్వం కూడా ఆయనే చేసారు. పైగా సొంత సినిమా కూడా.

అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీగా నిల్చింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఏడుసార్లు త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. 1978లో తొలిసారి కుమార్ రాజా సినిమాల్లో మూడు పాత్రలు పోషించి సూపర్ హిట్ కొట్టారు. 1982లో రెండు సినిమాల్లో మూడేసి పాత్రలు వేయగా, అందులో పగబట్టిన సింహం సూపర్ హిట్ అయింది. డాక్టర్ సినీ యాక్టర్ ఏవరేజ్ గా నిల్చింది. 1983లో సిరిపురం మొనగాడులో నాలుగోసారి ట్రిపుల్ రోల్ వేసి ఏవరేజ్ టాక్ సొంతం చేసుకున్నారు.

ఇక 1984లో రెండు మూవీస్ లో ట్రిపుల్ రోల్ వేస్తె, అందులో రక్త సంబంధం ప్లాప్ అయింది. బంగారు కాపురం పర్వాలేదనిపించింది.1997లో బొబ్బిలి దొర మూవీలో ట్రిపుల్ రోల్ చేయగా, అది ప్లాప్ అయింది. అందాల నటుడు శోభన్ బాబు 1983లో ముగ్గురు మొనగాళ్లు మూవీలో ట్రిపుల్ రోల్ వేయగా అది ప్లాప్ అయింది. అయితే 1994లో మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు పేరిట ట్రిపుల్ రోల్ చేయగా ఏవరేజ్ గా నిల్చింది. 2012లో బాలయ్య అధినాయకుడు మూవీలో మూడు పాత్రలు వేసి,ప్లాప్ మూటగట్టుకున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ 2017లో జై లవకుశ మూవీ ద్వారా మూడు పాత్రలు పోషించగా, ఈ మూవీ విజయాన్ని నమోదుచేసుకుంది.