Movies

వాడిపోయిన పూలను పడేయకండి అంటున్నమెగా కోడలు …. ఎందుకో తెలుసా?

చిరంజీవి కోడలు ఉపాసన సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.ఆమె చేసే పనులు ఎక్కువగా సామాజిక సృహను కలిగించేవిగా ఉంటాయి.అందుకే ఉపాసన మంచి మనసుకు అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు.కోట్ల వ్యాపార సామ్రాజ్యంను నడిపిస్తున్న ఉపాసన ఖాళీ సమయం ఉన్నా లేకున్నా కూడా మంచి పనుల కోసం కష్టపడుతూనే ఉంటుంది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన పోస్ట్‌ల ద్వారా సమాజంలో కొంతలో కొంత అయినా మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.తాజాగా ఉపాసన మరో సామాజిక అంశంతో జనాల ముందుకు వచ్చింది.మనం రెగ్యులర్‌గా వాడే పూలను వాడిపోయిన తర్వాత పడేస్తాం.కాని వాటిని పడేయకుండా రీసైక్లింగ్‌ చేయవచ్చు అంటూ ఉపాసన చెబుతోంది.

పూలను వృదాగా పడేయడం వల్ల వాతావరణం కలుషితం అవ్వడంతో పాటు వ్యర్థాలు ఎక్కువగా అవుతాయని అందుకే వాటిని రీ సైక్లింగ్‌ చేయడం వల్ల అందరికి ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.
హోలివేస్ట్‌ అనే సంస్థ ఇలా వాడిపోయిన పూలను సేకరించి వాటిని రీ సైక్లింగ్‌ చేసి వాటి ద్వారా దూప్‌స్టిక్స్‌ను మరియు పూజా సామాగ్రిని తయారు చేస్తారట.

అందుకే వాడిపోయిన పూలను చెత్తలో పడవేయకుండా జాగ్రత్తగా ఉంచి వారిని సంప్రదించినట్లయితే వారు ఇంటికి వచ్చి మరీ వాడిపోయి పాడైపోయిన పూలను తీసుకుంటారంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.దేవుడికి వాడిన పూలు వాడిపోతే మళ్లీ వాటిని దేవుడికే దక్కేలా చేసేందుకు రీ సైక్లింగ్‌ చేయించడం బెటర్‌.