బన్నీ Vs త్రివిక్రమ్…అల వైకుంఠపురంలో ఏమి జరుగుతుంది?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురంలో మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటు ఫాన్స్ లో అటు ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. గత మూవీ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కనుక బన్నీ అల వైకుంఠపురంలో మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీతో పూర్వ వైభవం సంతరించుకోవాలని బన్నీ భావిస్తున్నాడు. అయితే సినిమా నిడివి విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయట. ఈమేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఫైనల్ కాపీ వచ్చాక 3గంటల 5నిమిషాల నిడివి రావడంతో 2గంటల 45నిమిషాలే ఉండాలని అల్లు అరవింద్,బన్నీ అంటున్నారట. అయితే నిడివి తగ్గించడానికి త్రివిక్రమ్ కుదరదని అంటున్నాడట. అన్నీ సెట్ అయ్యాయని,ఇక మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ బన్నీకి నిర్ణయం వదిలేసాడట. కెరీర్ కి సంబంధించిన సినిమా కావడంతో బన్నీ కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నాడట. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.