రోజాను ఎప్పుడో లవ్ చేసిన ప్రముఖ డాన్స్ మాస్టర్ ఎవరు.?
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి మరియు రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి కోసం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.ఒక పక్క తన రాజకీయాలతో పాటుగా మరోపక్క టెలివిజన్ షోలలో కూడా కనిపిస్తుంటారు.అయితే ఒకనాడు తెలుగు ఇండస్ట్రీను షేక్ చేసిన రోజా అప్పటి కుర్రకారును కూడా ఉర్రుతలు ఊగించారు.అలాగే ఇప్పటికీ ఆమె నవ్వు అంటే చాలా ఇష్టం అని చాలా మంది చెప్తూ ఉంటారు.
అయితే అసలు సినీ ఇండస్ట్రీకు రావడానికి కేవలం రోజా గారి చిరునవ్వే ఒక ముఖ్య కారణం అని చెప్పి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీ ఛానెల్లో జరిగిన న్యూయర్ ఈవెంట్ లో చెప్పారు.తన చిన్న వయసులో రోజా నటించిన భైరవ ద్వీపం సినిమా ఎన్నో సార్లు చూసానని నిజానికి తాను అప్పట్లో మిమ్మల్ని లవ్ చేసానని ఆన్ స్టేజ్ చెప్పేసారు.మొత్తానికి రోజా గారిపై శేఖర్ మాస్టర్ తో పాటుగా జానీ మాస్టర్ కు విపరీతమైన అభిమానం ఉందని చెప్పాలి.