Sports

సచిన్ టెండూల్కర్ ఎన్ని కోట్ల ఆస్థి సంపాదించాడో తెలుసా?

మనదేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా క్రికెట్ ప్రేమికులకు తెల్సున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పవచ్చు. అయితే ఆటలోనే కాదు,రిచ్ లోనూ తీసుపోడని అంటున్నారు. ఆటగాడిగానే కాదు,విలువలు తెల్సిన వ్యక్తిగా నిలిచారు. క్రికెట్ ద్వారా మంచితనం,స్టార్ డమ్,పాపులార్టీ సంపాదించుకున్నాడు. రాజ్య సభ సభ్యునిగా కూడా పనిచేసారు.

23ఏళ్ళ క్రికెట్ చరిత్ర గల సచిన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. సచిన్ నిజమైన ఆస్తి ఎంత, ఒక మ్యాచ్ ఆడడానికి ఎంత దక్కుతుంది,ఏడాది సంపాదన ఎంత వంటి విషయానికి వస్తే, ఆస్తి విలువ 836కోట్లు. ఏడాదికి 86కోట్లు సంపాదిస్తాడట. ఎంతోమంది యంగ్ క్రికెటర్స్ ని తన ఫౌండేషన్ ద్వారా ఇండియన్ టీమ్ కి పరిచయడం చేస్తున్నాడు. తాను ఎదగడమే కాదు, పక్కనున్న వాళ్ళను కూడా ఎదగడానికి దోహదం చేస్తాడు.

ముంబైలో 25కోట్ల విలువ చేసే ఒక ఇల్లు ఉండగా, 8సూపర్ లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్నాడు. అయితే అతడికి ఇవన్నీ నిజమైన ఆస్తులు కావట. ఎదుటివారికి సాయం చేసే గుణం,ఫౌండేషన్స్ ద్వారా అందించే చేయుట అతడి నిజమైన ఆస్తులుగా చెబుతుంటారు. అనాధ ఆశ్రమాలకు డొనేషన్స్ విరివిగా ఇస్తుంటాడు. ఇక చాలామంది పేద విద్యార్థులు ఇతడి ఫౌండేషన్స్ కారణంగా బడికి వెళ్తున్నారని చెప్పాలి.