Politics

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. మిర్చి, పసుపు, ఉల్లి వంటి పంటలకు మద్ధతు ధరను నిర్ణయిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పంటలకు నిర్ణయించిన ధరల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది.

అయితే మిర్చి, పసుపు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేకున్నా రైతుల కోసం మద్దతు ధరను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్ రెడ్డి తెలిపారు. అయితే నిర్ణయించిన ధరల ప్రకారం మిర్చి క్వింటాలుకు రూ.7వేలు, పసుపు రూ.6350, ఉల్లి రూ.770, చిరుధాన్యాలు క్వింటాలుకు రూ.2500 కనీస మద్దతు ధర ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది