15 ఏళ్ల క్రితం చిరు,విజయశాంతికి జరిగిన గొడవ ఇదే… అందుకు కారణం ఎవరో తెలుసా?
తెలుగు సినిమా రంగంలో కొందరు హీరో హీరోయిన్స్ హిట్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రెస్ గా ఉంటారు. వీరి జోడి హిట్ ఫెయిర్ గా నిలిచిపోతుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి,లేడి అమితాబ్ విజయశాంతి జంటను ప్రధానంగా చెప్పాలి. కమర్షియల్ మూవీ అయితే మెగాస్టార్ కాసులు కురిపిస్తాడు. ఇక విజయశాంతి తోడైతే సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టేస్తుంది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ అంతలా అదిరిపోయేది. మొత్తం 19సినిమాలు జంటగా చేయగా, రెండు మూడు సినిమాలు తప్ప మిగిలినవన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. అయితే చిరంజీవి,విజయశాంతి కూడా రాజకీయాల్లో చేరి,సినిమాల్లో గ్యాప్ తీసుకున్నారు.
ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వగా,తాజాగా రిలీజయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ తాజా చిత్రం ప్రీరిలీజ్ సందర్బంగా మెగాస్టార్ ముఖ్య అతిధిగా వచ్చి, లాంచ్ చేసారు. అయితే ఈనేపధ్యంలో చిరంజీవి, విజయశాంతి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆరోజుల్లో కల్సి నటించిన సినిమాలు,అందులోని పాటలు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇలా అన్ని విషయాలను ఇద్దరూ పంచుకున్నారు. వీళ్ళు చేసిన సినిమాలు ఎన్ని,ఎందుకు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది వంటి విషయాలను గూగుల్ లో సెర్చ్ చేయడంతో ఒక సీక్రెట్ బయటపడిందట.
సంఘర్షణ మొదలు,దేవాంతకుడు,మహానగరంలో మాయగాడు ,ఛాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపధం,పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచిదొంగ, యుద్ధభూమి,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర,కొండవీటి దొంగ, స్వయంకృషి,గ్యాంగ్ లీడర్,స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్,మెకానిక్ అల్లుడు ఇలా 19సినిమాలు చేసారు. నావల్లే సినిమా హిట్ అవుతుంది, చిరంజీవి వలన కాదని ఎవరితోనో విజయశాంతి అన్నారట. విషయం తెల్సిన చిరంజీవి ఆమెతో కల్సి నటించడం ఆపేసాడట. అప్పటినుంచి ఇద్దరూ కల్సి నటించలేదు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని, అలా అయితే సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ కి చిరు వచ్చేవారు కాదని, అందుకే ఇలాంటివన్నీ రూమర్లేనని టాలీవుడ్ ప్రముఖుల వాదన.