ఎంత మంచి వాడవురా ఎంత రాబట్టాడో తెలుసా..?

తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించినటువంటి చిత్రం ఎంత మంచి వాడవురా.!.ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ సతీష్ విఘ్నేశ్ దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన గ్లామర్ డాల్ మెహరీన్ కౌర్ నటించగా తనికెళ్ల భరణి రాజీవ్ కనకాల వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈనెల 15వ తారీఖున విడుదలయింది.అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో దిగినటువంటి ఈచిత్రం అంచనాలకు మించి దూసుకుపోతోంది.అంతేగాక విడుదలైన మొదటి రోజే దాదాపుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో 4కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి కళ్యాణ్ రామ్ సినిమా కెరియర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది.దీంతో ఎంత మంచి వాడవురా.! కూడా సంక్రాంతి బరిలో మంచి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వారాంతం కూడా దగ్గరికి రావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల చిత్రాలు కూడా కాసుల వర్షం కూడా బాగానే కనిపిస్తున్నాయి.దీంతో కళ్యాణ్ రామ్ కూడా వీరికి మంచి పోటీని ఇస్తున్నాడు.