రానా సినిమాల్లో వచ్చాక,రాకముందు సంపాదించినా ఆస్తి ఎంతో తెలుసా?
లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బాహుబలితో విలన్ గా సరికొత్త అవతారంతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్న దగ్గుబాటి రానా ఎన్నో వైద్యమైన పాత్రలతో అలరిస్తున్నాడు. సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా కావచ్చు అందులో జీవించడమే అతడి లక్ష్యం అన్నట్లు ఉంటుంది.
మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడికి మనవడు,ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అయిన రానా లో కష్టపడే తత్త్వం ఉంది. పాత్రకు తగ్గట్టు ఆహార్యాన్ని మార్చుకోవడం అతడిలో గొప్ప లక్షణం. పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లు ఉంటుంది అతడి నటన.
ఇంతలా పాపులారిటీ సొంతం చేసుకున్న రానా నిజమైన ఆస్థి ఎంత,ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు,ఏడాది సంపాదన ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే , అతడి ఆస్తి 155కోట్లు. ఏడాదికి 20నుంచి 25కోట్లు సంపాదిస్తాడు. ఒక్కో సినిమాకు 10నుంచి 15కోట్లు తీసుకుంటాడట. హైదరాబాద్ లో 5కోట్లు విలువచేసే ఇల్లు, కోట్లు విలువచేసే రెండు కారులు ఉన్నాయి.
