Movies

నంది అవార్డులు ఎక్కువ గెలిచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చలన చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 1964లో నంది పురస్కారాలను ప్రవేశపెట్టింది. అయితే అప్పటినుంచి లెక్కేస్తే ఎక్కువగా నంది అవార్డులు గెలిచిందెవరో ఒకసారి చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు తొలి నంది 1964లో అందుకున్నారు. ఇక అక్కడ నుంచి 5సార్లు నంది అవార్డులు ఉత్తమ నటుడిగా అందుకున్నారు. ఈయనతో సమానంగా ఐదు సార్లు నంది అవార్డులు అందుకున్న హీరో శోభన్ బాబు.

వరుసగా మూడేళ్లు నంది అవార్డు గెలుచుకున్న హీరోగా ఇప్పటీకే శోభన్ బాబుదే రికార్డ్. కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్,దాసరి నారాయణరావు రెండేసి సార్లు నంది బహుమతులు అందుకున్నారు. ఎన్టీఆర్,కృష్ణ,ఎస్వీ రంగారావు, చంద్రమోహన్ ఒక్కొక్కసారి మాత్రమే నంది బహుమతులను అందుకున్నారు. తర్వాత జనరేషన్ లో చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ,,జగపతి బాబు మూడేసి సార్లు ఉత్తమనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.

ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్కసారి నంది అవార్డు అందుకున్నారు. ఇక ఇప్పటి స్టార్ హీరోల్లో నాలుగు సార్లు నంది అవార్డు సొంతం చేసుకున్న ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబుకే దక్కుతుంది. అయితే ఎలాంటి వివాదాలకు తావులేకుండా తన నటన వరకే పరిమతమయ్యే విక్టరీ వెంకటేష్ అవార్డుల్లో కూడా ఆనాటి మేటి నటులు అక్కినేని,శోభన్ బాబులతో సమానంగా ఐదుసార్లు నంది అవార్డులను అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. ఈ రికార్డ్ ఎవరు అధిగమిస్తారో చూడాలి.