Business

ప్రపంచ ధనికుడు బిల్ గేట్స్ కి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ధనికులైన వారి లిస్టులో మొదట ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ఉంటుంది.ఇతడు డబ్బు పరంగానే కాదు మంచి మనసున్న వ్యక్తి గా కూడా ప్రజలకు బాగా తెలుసు.ఎందుకంటే ఇప్పటికే తన సంపాదనలో చాలా మొత్తాన్ని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకి ధార పోసాడు.అయితే తాజాగా బిల్ గేట్స్ కూతురి ప్రేమవివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇందులో భాగంగా తన కూతురు జెన్నీఫర్ గేట్స్, ప్రముఖ హార్స్ రేసర్ నాసర్ అనే వ్యక్తిని ప్రేమించింది.ఈ క్రమంలో తమ ప్రేమ ఈ విషయాన్ని తండ్రి బిల్ గేట్స్ కి చెప్పడం తో కూతురు ప్రేమ సమ్మతించి ప్రేమికుడితో నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ విషయాన్ని జెన్నీఫర్ గేట్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్ల తో పంచుకుంది.అంతేగాక దానికి సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

దీంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.అంతేగాక తన తండ్రి లాగానే మంచి పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."