తాప్సీ నో చెప్పిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. బబ్లీ గాళ్‌గా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ, స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయింది. బాలీవుడ్ నుండి వచ్చిన ఓ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుంది. అనుకోని విధంగా కెరీర్ టర్న్ అయిపోయింది. ఇప్పుడక్కడ స్టార్ హీరోలతో దాదాపు సమానంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. అక్కడ సత్తా చాటిన తాప్సీ, టాలీవుడ్ దర్శకుల పైనా, హీరోలపైనా విమర్శలు చేస్తూ, అవాకులు చవాకులు పేలిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పిందట. అయితే, ఆ తర్వాత తేరుకున్న తాప్సీ సదరు దర్శకులకు, హీరోలకు సారీ కూడా చెప్పిందటలెండి.
ఇంతకీ ఆ స్టార్ హీరోలెవరు.? అనే సీక్రెట్ మాత్రం రివీల్ చేయలేదు తాప్సీ. తాజాగా బాలీవుడ్‌లో కరీనాకపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ రేడియో షోలో తాప్సీ ఈ విషయాలను పంచుకుంది. బాలీవుడ్‌లో స్టార్‌డమ్ అందుకున్నాక తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించింది తాప్సీ. కానీ, అప్పుడూ స్టార్ హీరోలను టచ్ చేయలేదు. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన తాప్సీ పేరు వినబడడం లేదు ఎందుకో. ఇకపోతే, బాలీవుడ్‌లో తాప్సీ వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగానే గడుపుతూ ఉంటుంది. ఫ్రెష్‌గా తాప్సీ నటిస్తున్న ‘శభాష్ మిథు’ సినిమా ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇండియన్ లేడీ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.