Politics

ఇప్పటి మన మినిస్టర్ అప్పటి హీరో లా ఉన్నాడుగా…? ఎవరో గుర్తు పట్టారా…???

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమారుడు మంత్రి కేటీఆర్ గురించి దాదాపుగా తెలియని వారెవరు ఉండరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని, ఒక చెదరని ప్రత్యేకమైనఇమేజ్ ని సంపాదించుకున్నాడు కేటీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఐటీ శాఖా మంత్రి పదవిని దక్కించుకొని, రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపిస్తూ, మన తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని రాబడుతున్నటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం సామజిక మాంద్యమాల్లో కూడా సమకాలీన అంశాలపై స్పందిస్తూ చాలా ఆక్టివ్ గా ఉంటారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ, తాజాగా ఆయన తొలిసారి తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న జ్ఞాపకాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకునేందుకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోస్ట్ చేశారు. అప్పటి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 కేటీఆర్ డ్రైవింగ్ లైసెన్స్ కేటీఆర్, ఆ లైసెన్స్ పైన ఉన్న ఫోటో కూడా షేర్ చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే… ఆ ఫొటోలో మంత్రి కేటీఆర్ అప్పట్లో సినిమా హాళ్లలో విడుదలై కొన్ని సంచలనాలను సృష్టించినటువంటి “ప్రేమదేశం” మూవీ హీరో వినీత్ లా ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్, ఆ మీస కట్టు అన్ని అచ్ఛం హీరో వినీత్ మాదిరి కనిపిస్తున్నారు. అయితే ఆ చిత్రం 1996 లో విడుదలయింది. కాగా అదే తరహా స్టైల్ ని మన మంత్రి కేటీఆర్ కూడా ఫాలో అయ్యుంటారని అర్థమవుతుంది. ప్రస్తుతానికి కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో సామాజిక మాంద్యమాల్లో వైరల్ గా మారుతుంది.