Movies

అల వైకుంఠపురంలో సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..???

ఈ సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టిన అలవైకుంఠపురంలో మూవీతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖుషీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్,హారిక సంస్థలు సంయుక్తంగా తీసిన ఈ సినిమా లో బన్నీ సరసన పూజ హెగ్డే జంటగా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సేస్ లో సైతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంతలా భారీ విజయం అందుకోవడంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కల్సి మూడో సినిమా కూడా కావడంతో ఇక ఆనందానికి హద్దుల్లేవు.

ఈ సెన్షేషనల్ మూవీ కి ఇప్పుడు సీక్వెల్ వస్తోందన్న వార్తలు వైరల్ అయ్యాయి. సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు గానీ, ఇంతలా విజయాన్ని నమోదు చేస్తుందని బన్నీ, త్రివిక్రమ్ లు సైతం ఊహించలేదట. అయితే ఇందులో నటించిన సుశాంత్ ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ సక్సెస్ ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదన్నాడు. అయితే సినిమా నిర్మాణ సమయంలో బన్నీతో మరో సినిమా తీయాలని,దాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తామని అల్లు అరవింద్ అన్నారట.

అరవింద్ అడగ్గానే త్రివిక్రమ్ ఒకే చెప్పేశాడట. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారట. అయితే ఆతర్వాత చిరంజీవి,ప్రభాస్ ,రామ్ చరణ్ లతో కూడా త్రివిక్రమ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇలాంటప్పుడు బన్నీతో సినిమా అనేది ఎప్పుడు అనేది చెప్పడం కష్టమే. ఇక సినిమా హిట్ తర్వాత డైరెక్టర్స్ కి బన్నీ ఇచ్చిన పార్టీకి కె రాఘవేంద్రరావు,త్రివిక్రమ్ శ్రీనివాస్,కొరటాల శివ,ఇంకా చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. ఆ సమయంలోనే అలవైకుంఠపురం లో మూవీకి సీక్వెల్ తీస్తే బాగుంటుందన్న చర్చ వచ్చిందట. సీక్వెల్ ఎలా ఉండాలో ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా చెప్పడంతో త్రివిక్రమ్ కి ఆశ్చర్యం వేసిందట. వీళ్ళు చెప్పిన పాయింట్స్ తో సీక్వెల్ తీయొచ్చు అన్నారట. సో అందుకోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్న చర్చ నడుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."