Politics

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు…ఎవరికీ ఎక్కువ…ఎవరికీ తక్కువ…?

ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాన్ని గౌరవ వేతనాలు అంటారు. ఇక సీఎం లకు కూడా అలాగే వేతనాలు వస్తాయి. అయితే అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం అవి ఏ రేంజ్ లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణా సీఎం కె చంద్రశేఖరరావు నెలజీతం 4లక్షల పదివేలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెలజీతం 3లక్షల 90వేలు. దేశంలోని సిఎంలలో ఈయనదే అత్యధిక జీతం. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ నెలజీతం 3లక్షల 65వేలు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే కి నెలకు జీతం 3లక్షల 40వేలు. ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాగెల్ నెలజీతం 2లక్షల 30వేలు. మధ్య ప్రదేశ్ సీఎం కమలనాధ్ నెలజీతం 2లక్షల 55వేలు. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నెలజీతం 2లక్షల 88వేలు.

గుజరాత్ సీఎం యోగి విజయ్ రూపాని నెలజీతం 3లక్షల 21వేలు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ నెలజీతం 2లక్షల 72వేలు. కేరళ సీఎం పినరాయ్ విజయన్ నెలజీతం ఒక లక్షా 85వేలు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నెలజీతం 2లక్షల 10వేలు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నెలజీతం 2లక్షల 30వేలు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ నెలజీతం 2లక్షల 20వేలు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నెలజీతం 2లక్షల 15వేలు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ నెలజీతం ఒక లక్షా 20వేలు. అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ నెలజీతం ఒక లక్షా 25వేలు. త్రిపుర సీఎం బీప్లబ్ కుమార్ దేబ్ నెలజీతం ఒక లక్షా 5వేలు. కర్ణాటక సీఎం యెడ్యూరప్ప నెలజీతం 2లక్షలు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ నెలజీతం 3లక్షల 10వేలు.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలజీతం 3లక్షల35వేలు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ నెలజీతం 2లక్షల 72వేలు. . ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నెల జీతం ఒక లక్షా 75వేలు. మేఘాలయ సీఎం కొండ్రాడ్ సంగ్మా నెలజీతంఒక లక్షా 50వేలు. తమిళనాడు సీఎం పళనిస్వామి నెలజీతం 2లక్షల 5వేలు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ నెలజీతం ఒక లక్షా 60వేలు. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తామంగ్ నెలజీతం ఒక లక్షా 90వేలు. అరుణా చల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నెలజీతం ఒక లక్షా 33వేలు. నాగాలాండ్ సీఎం నైపిహు రియో నెలజీతం ఒక లక్షా 10వేలు.