Movies

“ఢీ” కంటెస్టెంట్స్ కు శేఖర్ మాస్టర్ వార్నింగ్!..కారణం అదేనా…?

ఈటీవీ తెలుగు ఛానెల్లో అత్యంత ఆదరణ కలిగిన షోలలో “ఢీ” సిరీస్ కూడా ఒకటి.మన దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షోలలో ఒకటైన ఈ సెన్సేషనల్ డాన్స్ షో ఇప్పుడు 12 వ సీజన్లోకి అడుగు పెట్టి దానిని కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది.ప్రదీప్,సుడిగాలి సుధీర్,హైపర్ ఆది వంటి వారితో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించడమే కాకుండా కంటెస్టెంట్స్ తాలూకా మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ లతో అదరగొడుతుంది.

అయితే ఇప్పుడు కొనసాగుతున్న ఈ “ఢీ ఛాంపియన్స్” సీజన్ మరింత ఆసక్తికరంగా సాగనుంది అని అర్ధం అవుతుంది.ఇప్పటి వరకు డాన్స్ అంటే ప్రాణం ఇచ్చే ఎందరో కంటెస్టెంట్స్ ను మనం చూసాము కానీ కొంతమందికి మాత్రం ఇదే ఢీ స్టేజ్ నుంచి కస్టపడి పైకొచ్చి అదే షోకు న్యాయ నిర్ణేతగా మారిన శేఖర్ మాస్టర్ తమ కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.తాజాగా విడుదల కాబడిన వచ్చే వారపు ప్రోమోలో మొదట అంతా మంచి ఎంటర్టైనింగ్ గా సాగినా లాస్ట్ లో మాత్రం శేఖర్ మాస్టర్ ఢీ కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యారు.

“ఏదో చెయ్యడానికి మీరు ఇక్కడి వరకు రాలేదని ప్రతీ ఎపిసోడ్ ప్రతీ రౌండ్ లో ది బెస్ట్ ఇవ్వగలిగితేనే ఇక్కడుండాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు.మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అసలు ఎవరి పెర్ఫామెన్స్ మూలాన శేఖర్ మాస్టర్ ఇంతలా ఓపెన్ అయ్యారో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 19 బుధవారం రాత్రి మీ ఈటీవీ ఛానెల్లో “ఢీ ఛాంపియన్స్” ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."