Movies

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్…పరిస్థితి తెలిసి షాక్ లో సినీ పరిశ్రమ

ఈ మధ్య సినిమా రంగంలో ఎప్పుడు ఎవరికేమి అవుతుందో తెలీడం లేదు. అందుకే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడుతున్నారు. తాజాగా గౌండమని ఆరోగ్య పరిస్థితి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో 310కి పైగా సినిమాల్లో నటించి ఆడియన్స్ ని ఆనందపరిచిన ఇతడి ఆరోగ్యం ఇప్పుడు విషంగా ఉందట. ఇతడి వయస్సు 80ఏళ్ళు.

కోయంబత్తూరు దగ్గర వాళ్ళకుందాపురం అనేగ్రామంలో జన్మించిన గౌండమని కి భార్య శాంత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మరో కమెడియన్ సెంథిల్ తో కల్సి చాలా ఏళ్లుగా గౌండమని జనాన్ని పంచ్ డైలాగులతో నవ్వించాడు. వీరిద్దరిదీ సూపర్ హిట్ కామెడీ స్టార్స్ గా పేరు మారుమోగింది. నిజానికి ఇతడి పేరు సుబ్రహ్మణ్యన్ కరుప్పియా. డ్రామాల్లో నటించడం వలన గౌండమనిగా పేరొచ్చింది. 16సంవత్సరాల వయస్సు నుంచి డ్రామాల్లో నటిస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సినిమాల్లో 1980నుంచి 2000వరకు గౌండమని హవా కొనసాగింది. అయితే ఆరోగ్యం దెబ్బతినడంతో గత పదేళ్లలో నాలుగే నాలుగు మూవీస్ లో చేసాడు. ఇక నాలుగైదేళ్లుగా పరిస్థితి మరింత విషమించింది. పూర్తిగా బక్కచిక్కి గుర్తుపట్టేందుకు వీలులేకుండా మారిపోయాడు. ఇక కొన్నాళ్ల క్రితం హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చికిత్స కూడా పొందాడట. ఇప్పుడు కాలేయం,కిడ్నీ సమస్యలకు మరో హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారట. అయితే గౌండమని ఆరోగ్యంగానే ఉన్నాడని,పుకార్లను నమ్మవద్దని ,త్వరలో ఓ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినవస్తున్నాయి. నిజానికి ఓ ఫంక్షన్ లో అతడిని చూసిన ఫాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారట.