మహేష్-బన్నీల మధ్య మరో వార్…ఇలా అయితే ఎలా….?

ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మూవీ విడుదలైన సంగతి తెల్సిందే. రిలీజ్ ముందు నుంచే వీరిద్దరి సినిమాలపై అంచనాలు పెరిగిపోవడం,రిలీజ్ డేట్ కోసం వార్ ఏ రేంజ్ లో వెళ్లిందో అందరికి తెలుసు. ఇక రిలీజ్ అయ్యాక ఈ రెండు మూవీస్ మధ్య కూడా వీర లెవెల్లో వార్ నడిచింది.

తమ సినిమాతోనే రియల్ సంక్రాంతి అంటే,తమ సినిమాయే రియల్ సంక్రాంతి అని ఎవరికీ వాళ్ళు ప్రచారం సాగించారు. ఇక ఈమధ్య కొంత సైలెంట్ అయ్యారు. కానీ మళ్ళీ ఇద్దరి మధ్యా మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. సరిలేరు విడుదలయి,ఫిబ్రవరీ 29కి 50రోజులు పూర్తవుతుంది. దీంతో 50రోజుల వేడుక గ్రాండ్ గా చేయాలనీ నిర్మాతలు సన్నద్ధం అవుతున్నారు. మహేష్ ఒకే చేస్తే,ధూమ్ ధామ్ అనిపించడానికి యూనిట్ రెడీగా ఉంది.

ఇక అదేరోజు 50రోజుల వసూళ్ల రిపోర్ట్ ని ఆడియన్స్ ముందు పెట్టాలని యూనిట్ భావిస్తోంది.ఏరియా వారీగా లెక్కలు చెప్పి,ఇదీ మా హీరో దమ్ము అని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ప్లాన్ లో ఉన్నాడట. మరి ఇంత జరుగుతుంటే,అలవైకుంఠపురంలో టీమ్ కూడా అణాపైసలతో సహా లెక్కలు చెప్పేస్తారనే చర్చ నడుస్తోంది. అందుకే మార్చి 1వ తేదీనాటికి 50రోజులు పూర్తవుతున్నందున ఆరోజు లెక్కలు చెప్పాలని,గ్రాండ్ గా ఫంక్షన్ చేయాలని యూనిట్ ఉందట. ఇండస్ట్రీ హిట్ అనే ఆధారాలు చూపిస్తారట. మరి లెక్కల వార్ ఎలా ఉంటుందో చూడాలి.

error: Content is protected !!