Movies

గుట్టు విప్పిన హైపర్ ఆదికి జబర్దస్త్ బ్యూటీ సీరియస్ వార్నింగ్

బుల్లితెరపై ఏడేళ్లకు పైగా దూసుకుపోతున్న జబర్దస్త్ కామెడీ షోలో ఒక్కోసారి అనుకోని ఘటనలు జరిగినవి కొద్దిగా కనిపిస్తాయి. ఇక కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉన్నప్పటికీ, తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని తీసుకొస్తుంటాడు.

తనకు ఇదే మంచి సక్సెస్ ఫార్ములాతో ఆది అలా నెగ్గుకొచ్చేస్తున్నాడు. అప్పుడ ప్పుడూ ఆది స్కిట్స్ కోసం వేసే పంచ్ డైలాగులు, రాసుకునే డైలాగులు బయట కూడా బాగానే పాపులర్ అవుతాయి. ఇక తాజాగా తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్లు వేసాడు. ముఖ్యంగా అను రెమ్యునరేషన్ గురించి కూడా హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. దాంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ ముందూ వెనుకా చూడకుండా స్టేజీపైనే వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో భాగంగా ఆది ఓ స్కిట్ చేసాడు. అందులో అనసూయ చిన్నప్పటి కారెక్టర్ కూడా ఉంటుంది.

అప్పట్నుంచే పక్కన టచ్ అప్ అంటూ మేకప్ మెన్ ఉంటాడు. అక్కడ్నుంచి మొదలైన పంచుల ప్రవాహం పెద్దైన తర్వాత కూడా కొనసాగుతుంది. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటే ఆ అందుకేగా అక్కడా ఇక్కడా రెండు చోట్లా బ్యాలెన్స్ చేస్తుందంటూ ఆది పంచ్ వేసాడు.ఆ తర్వాత మూడంతస్థుల మేడ కట్టారు అంటే వెంటనే ఎందుకు కట్టదు.. ఆమెకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు. దాంతో వెంటనే అనసూయ నా మీద పడి ఏడుస్తావ్ ఎందుకు అన్నట్లు అతడి వైపు కోపంగా చూస్తుంది. ఈ పంచులు అయితే బాగానే పేలాయి. అక్కడ ఆది రాసిన డైలాగులు కూడా కామెడీ కోసమే అయినా రెమ్యునరేషన్ మాత్రం నిజమే అని ఫాన్స్ అంటున్నారు.