Movies

తీవ్ర ఇబ్బందుల్లో రేణు దేశాయ్ – కారణం పవన్ ఫాన్స్ ఐతే కాదుగా…?

పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి అభిమానులు ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని అభిమానులు అనడం కంటే భక్తులు అనేయొచ్చు కూడా. అంత గొప్ప అభిమానులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… కానీ పవన్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని ఎవరైనా ఏమైనా అన్నారంటే మాత్రం వారి ఆగ్రహానికి గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే, వేరే వారు ఏం చేసినప్పటికీ కూడా అది తప్పే అని చెప్పే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. దానికి తోడు పవన్ మీద ఉన్న అభిమానం తో వారు చేసే పలు కామెంట్ల వలన కూడా చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా.

ఇలా ఇబ్బందులు పడ్డ వారిలో ప్రధానంగా చెప్పుకునే పేరు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవన్ కలిసి ఉన్నప్పుడు వదిన అని, పవన్ నుండి విడిపోయాక ఇప్పుడు అనేకమైన మాటలతో తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా రేణు దేశాయ్ ఎలాంటి పోస్టు పెట్టినప్పటికీ కూడా ఆమెని లక్ష్యంగా చేసుకుని వాళ్ళు చేసే విమర్శలు శృతి మించుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా ఆమెకి కొందరు పవన్ అభిమానులు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నారు. అయితే మొదటగా ఇలాంటి వారి విషయంలో కొద్దిగా బయటపడ్డ రేణు దేశాయ్ ఇప్పుడు కాస్త సర్దుకుందని చెప్పుకొస్తుంది.