Movies

మనకు బాగా తెలిసిన ఈ వ్యక్తి సింగర్ సునీత భర్త అని మీకు తెలుసా?

కేవలం 15ఏళ్ళవయస్సులో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సింగర్ సునీత తన గాన మాధుర్యంతో ఓలలాడిస్తోంది. తెలుగులోనే కాదు,తమిళ,కన్నడ,మళయాళ భాషల్లో కూడా తన గానంతో ఫాన్స్ ని సంపాదించుకుంది. 3వేలకు పైనే పాటలు పాడిన ఈమెది కోకిల స్వరమే కాదు ,మైమరపించే రూపం ఆమె సొంతం. అందుకే ఎక్కడికెళ్లినా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. 500మూవీస్ కి పైనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసింది. టాప్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది ఈమె.

సునీతకు చిన్న వయస్సులోనే అంటే 19ఏళ్ళప్రాయంలోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి పేరు ఆకాష్ ,అమ్మాయి పేరు శ్రేయ. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు నిర్మాతలు ,దర్శకులు,సంగీత దర్శకులతో సన్నిహితంగా మెలగాల్సి ఉండడం కామన్. అయితే భర్త కిరణ్ ఆమె పై అనుమానం పెంచుకుని, తరచూ వేధించడం వలన ఇక చేసేదిలేక పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని విడాకులు తీసుకుంది.

కిరణ్ కుమార్ కూడా ఇండస్ట్రీ వ్యక్తే. సినిమా ఈవెంట్స్,సైమా లాంటి అవార్డ్స్ ఫంక్షన్ కి డైరెక్టర్ గా ఉంటున్నాడు. ఇద్దరూ విడిపోయి 10ఏళ్ళు అయింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వీరిద్దరికీ తల్లి అంటే ఎంతప్రేమో,తండ్రి మీద ప్రేమ ఎక్కువేనట. ఇటీవల తండ్రితో దిగిన పిల్లలిద్దరి ఫొటోస్ వైరల్ అయ్యాయి. కూతురు శ్రేయ స్టడీస్ తో పాటు సంగీతంపై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన సవ్యసాచి మూవీలో ఓ సాంగ్ పాడి అదరగొట్టేసింది. కొడుకు గ్రాడ్యుయేషన్ చేసి,ఉన్నత చదువు చదువుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."