సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా…షాక్ అయ్యే రెమ్యునరేషన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ డిఫరెంట్. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన యితడు చిన్న చిన్న పాత్రలనుంచి టాప్ హీరోగా ఎదిగాడు. 1975లో అపూర్వ రాగాలు అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన రజనీ 38ఏళ్లపాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ షేక్ చేసాడు. తమిళలోనే కాదు,తెలుగు రాష్ట్రాల్లో,భారతదేశం అంతటా పాపులార్టీ గల రజనీకి 68ఏళ్ళు వచ్చినా నటనలో పట్టు ఏమాత్రం కోల్పోలేదు.

యువ హీరోల మార్కెట్ ని సైతం అధిగమిస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగానే కాదు,హయ్యెస్ట్ ఫాన్స్ ఫాలోయింగ్ గల హీరో రజనీ కాంత్ అని చెప్పక తప్పదు. అయితే తనకు వచ్చే ఆదాయంలో 60శాతం పేదలకోసం వెచ్చించే మంచి మనిషి రజనీకాంత్. ఎన్నో ఛారిటీలకు,నిరుపేద కుటుంబాలకు సాయం అందిస్తూ వస్తున్నాడు. అంతేకాదు తన ఆస్థి అనాధ ఆశ్రమాలకు దక్కాలని రాశారట.

ఇంతటి స్టార్ డమ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడాది నెట్ వర్త్ ,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు,వంటి వివరాల్లోకి వెళ్తే,టోటల్ నెట్ వర్త్ 425కోట్లు. ఏడాదికి 62కోట్లు సంపాదిస్తాడు. ఒక్కో సినిమాకు 40నుంచి 50కోట్లు తీసుకుంటాడు. 10కోట్లు విలువ చేసే ఇల్లు,మూడు అధునాతన సౌకర్యవంతమైన కార్లు మెయింటేన్ చేస్తున్నాడు.